Friday, November 15, 2024

ఆగస్టులో రూ.50,000 రుణ మాఫీ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వర్షాలు, పంటలు, సాగునీటి లభ్యత, ఎరువులు, ఇతర వ్యవసాయ అంశాల పై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. ప్రగతి భవన్ లో సిఎం కెసిఆర్ అధ్యక్షతన ఆదివారం మధ్యాహ్నం తెలంగాణ మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా  వ్యవసాయానికి సంబంధించిన అంశాలపై చర్చించారు.  తెలంగాణ పత్తికి ఉన్న ప్రత్యేక డిమాండ్ వల్ల సాగును ఇంకా పెంచాలని, అందుకోసం రాష్ట్ర రైతాంగాన్ని సమాయత్తపరచాలని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులకు కేబినెట్ ఆదేశించింది. తెలంగాణలో ఇప్పటివరకు పంట రుణ మాఫీకి సంబంధించిన వివరాలను ఆర్థిక శాఖ కేబినెట్ ముందుంచింది.  కరోనా కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారడంతో గత రెండు సంవత్సరాలుగా రూ. 25,000 వరకు ఉన్న రుణాలను మాత్రమే మాఫీ చేశారని, ఆగస్టు 15 నుంచి నెలాఖరు వరకు రూ 50,000 వరకున్న పంట రుణాల మాఫీని పూర్తి చేయాలని కేబినెట్ ఆదేశించింది. రుణమాఫీతో 6 లక్షల మంది రైతులు లబ్ది పొందనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News