Monday, January 20, 2025

కేబినెట్ పరిశీలనకు 80 అంశాలు?

- Advertisement -
- Advertisement -

ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ డిఎలపై చర్చ
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పోడు భూముల పట్టాల
పంపిణీ, గవర్నర్ అధికారాలకు కోత,
పంచాయతీ రాజ్, ఆర్‌అండ్‌బి శాఖల
పునర్వవస్థీకరణపై దృష్టి

హైదరాబాద్: మంత్రివర్గ సమావేశం శనివారం ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం కానుంది. సిఎం కెసిఆర్ అధ్యక్షతన జరిగే సమావేశంలో వివిధ అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. సమావేశంలో మొ త్తంగా 7080కిపైగా అంశాలను చేర్చినప్పటికీ కనీసం 4045 అంశాలు చర్చించే అవకాశముందని తెలుస్తోంది. ప్రధానంగా ఉద్యోగుల పెండింగ్ డిఎలపై సమగ్రంగా చ ర్చించే అవకాశందని సమాచారం. ప్రస్తుతం మూడు డిఎలు పెండింగ్‌లో ఉం డగా వాటిలో ఒకటి, లేదా రెండు డిఎలకు మంజూరుకు అవకాశం కనిపిస్తోంది.

ఇక గవర్నర్‌తో రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం ఆ మోదించిన అనేక బిల్లులు గవర్నర్ నుంచి ఆమోదం లభించ లేదు. దీంతో బిల్లుల విషయంలో ప్రభుత్వం పలు రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నది. ఈ నేపథ్యంలో బిల్లుల పరిస్థితిపై ప్రధానంగా మంత్రివర్గం చర్చించనుందని అధికార వర్గాల్లో వినిపిస్తోంది. ఇందులో భాగంగా గవర్నర్ అధికారాలకు కత్తెర వేయడం కూడా మంత్రివర్గం చర్చించనుంది. ప్రధానంగా వర్శిటీల ఛాన్స్‌లర్ హో దా నుంచి గవర్నర్ తొలగింపు అంశంపై ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. యూనివర్సిటీలకు ఛాన్స్‌లర్లను నియమించే దిశలో చట్టాని తీసుకొచ్చేందుకు రూ పొందించిన బిల్లుపై మంత్రివర్గం చర్చిస్తుంది.

ఇక మంత్రివర్గ సమావేశం ముందుకు ఆర్థికశాఖ నుంచే అత్యధిక ఫైళ్లు రానున్నాయి. హోం శాఖ నుంచి 11 ఫైళ్లు. వాటిలో కొన్ని ర్యాటిఫికేషన్ ఫైళ్లు కూడా ఉన్నట్లుగా వినిపిస్తోంది. ఇక క్యాబినెట్ ఆమోదం కోసం మరికొన్ని కొత్త కరెంట్స్ కూడా ఉన్నాయని తెలుస్తోంది. ఇక ఎప్పటిలాగే ఎజెండాగా ప్రభుత్వ ప్రాధాన్యతా అంశాలపై కూడా చర్చకు రానున్నాయి. కాగా మంత్రివర్గ సమావేశంలో ప్రస్తుతం సంవత్సరానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితిపై క్యాబినెట్ కు నోట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు సమర్పించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమగ్రంగా చర్చించనున్నారు. ఇందులో భాగంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు… ఎంఆర్‌బిఎం కింద నిధుల కోత కారణంగా ఏర్పడిన నష్టం తదితర అంశాలపై కూలంకషంగా చర్చిస్తారు. ఈ లోటును ఎలా పూడ్చుకోవాలన్న అంశంపై చర్చించి మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

ఇక డిఎఫ్‌ఒ శ్రీనివాస్ రావు దారుణ హత్య నేపథ్యంలో పోడు భూములపై మంత్రివర్గం ప్రధానంగా చర్చించనుంది. సుమారు 20 లక్షల ఎకరాల పోడు భూముల క్రమబద్ధీకరణకు కోసం 4 లక్షల పైచిలుకు దరఖాస్తులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆర్‌ఒఆర్ చట్టం ప్రకారం పోడు భూములకు పట్టాల జారీపై చర్చించి తగు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అలాగే హోం, రెవెన్యూ, ఎంఎయుడి, పంచాయితీరాజ్ బిల్లులకు మంత్రివర్గం ఆమోదం తెలుపనుంది. విఆర్‌ఎల పేస్కేల్ అంశంపై చర్చ మంత్రివర్గం తగు నిర్ణయం తీసుకోనుంది. ఇక ఇరిగేషన్ శాఖ కోసం రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్‌ఇసి) నుంచి అదనంగా మరో రూ.10వేల కోట్ల నిధుల సమీకరణకు ప్రతిపాదనలతో పాటుగా రాష్ట్ర పోలీసుశాఖలో నార్కోటిక్స్‌కు ప్రత్యేక వింగ్ ఏర్పాటుపై చర్చించి ఆమోదం తెలుపనుంది. నార్కోటిక్ వింగ్ కోసం పాత 10 జిలాల్లో ప్రత్యేక స్టేషన్ల ఏర్పాటుకు క్లియరెన్స్ చేయనుంది. దీని కోసం 2 వేల పోస్టుల సృష్టించడంపై మంత్రివర్గం కూలంకషంగా చర్చించనుంది. దీంతో పాటు పోలీసుశాఖలోని సైబర్ క్రైమ్, ఇతర విభాగాల్లో మరో 2 వేల పోస్టుల రిక్రూట్మెంట్‌కు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News