Monday, December 23, 2024

నోటిఫికేషన్ కోసం లోక్‌సభ తేదీలు రాష్ట్రపతికి పంపిన క్యాబినెట్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఏడు దశల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఆయా తేదీలను నోటిఫై చేసే ప్రక్రియ ఆదివారం ప్రభుత్వం ప్రారంభించింది. ఈమేరకు ఎన్నికల కమిషన్ సిఫార్సులను క్యాబినెట్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించింది. ఏప్రిల్ 19న మొదటి దశలో జరగనున్న 102 స్థానాలకు మార్చి 20న నోటిఫికేషన్ వెలువడుతుంది. దీంతో నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. 18 వ లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19న ప్రారంభమై, ఏప్రిల్ 26, మే 7,మే 13,మే 20, మే 25,జూన్ 1 తేదీల్లో జరుగుతాయి.

ఆదివారం ఉదయం జరిగిన క్యాబినెట్ సమావేశం వివిధ దశల్లో జరగనున్న ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్లను జారీ చేయడానికి వీలుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సిఫార్సులను పంపించింది. అంతకు ముందు ఎన్నికల కమిషన్ లోక్‌సభ ఎన్నికల తేదీలతో కూడిన సిఫార్సులను కేంద్ర న్యాయశాఖ మంత్రిత్వశాఖకు పంపింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 14(2) ప్రకారం ఎన్నికల కమిషన్ తన సిఫార్సులను ప్రభుత్వానికి పంపింది.

దీని ద్వారా ఎన్నికల తేదీల నోటిఫికేషన్లను జారీ చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అభ్యర్థించింది. ఈ సిఫార్సు ఆధారంగా న్యాయమంత్రిత్వశాఖ క్యాబినెట్‌కు ప్రతిపాదన రూపొందించి పంపింది. దీనిపై రాష్ట్రపతి పార్లమెంట్ నియోజకవర్గాలు సభ్యులను ఎన్నుకోవలసిందిగా పిలుపునిస్తారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News