Wednesday, January 22, 2025

అసలైన రైతుకే భరోసా

- Advertisement -
- Advertisement -

అసలైన రైతుకే భరోసా
11 నుంచి 16వ తేదీ వరకు అన్ని జిల్లాల్లో రైతుల అభిప్రాయాలు
16న మరో సారి మంత్రివర్గ ఉపసంఘం భేటీ
రైతు భరోసా విధివిధానాల పై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం

మన తెలంగాణ / హైదరాబాద్: అసలైన రైతులందరికీ న్యాయం చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. రైతు భరోసా విధివిధానాల పై తెలంగాణ సచివాలయంలో శుక్రవారం కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయింది. ఉప సంఘం ఛైర్మన్ మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన ఆ భేటీలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పాల్గొని పలు అంశాలను చర్చించారు. ఈనెల 16న మరో సారి మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయి రైతుల నుంచి అభిప్రాయాలను సేకరించనుంది. ఈనెల 11 నుంచి 16వ తేది వరకు అన్ని జిల్లాల్లో రైతుల అభిప్రాయాలు తీసుకోవాలని నిర్ణయించింది. రోజుకు మూడు సమావేశాలు చొప్పున జిల్లా మంత్రుల ఆధ్వర్యంలో కేబినెట్ సబ్ కమిటీ రైతులతో భేటీ కానుంది.

5 ఎకరాలు కటాఫ్ పెట్టాలనే అంశంపై కేబినెట్ సబ్ కమిటీ లో చర్చ జరిగింది. 92శాతం చిన్న, సన్నకారు రైతులు 5 ఎకరాల లోపు ఉన్నారని మంత్రివర్గానికి అధికారులు నివేదిక అందించారు. గత ప్రభుత్వంలో రైతు బంధు నిధుల విడుదలలో 26వేల కోట్లు దుర్వినియోగానికి గురైయినట్లు సబ్ కమిటీకి వ్యవసాయ శాఖ అధికారులు నివేదిక అందించారు. ఇప్పటికే రైతు నివేదికల ద్వారా తీసుకున్న రైతుల అభిప్రాయాన్ని అధికారులు సబ్ కమిటీ ముందు ఉంచారు. రాష్ట్రంలో సాగు భూమి లెక్కలను కూడా అధికారులు మంత్రివర్గ ఉప సంఘానికి అందించినట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News