- Advertisement -
రైతు భరోసాపై చర్చించేందుకు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సబ్ సమావేశమైంది. కొద్దిసేపటి క్రితం సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం భేటీ ఆయ్యింది. సంక్రాంతికి రైతు భరోసా ఇవ్వాలని సర్కారు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతు భరోసా ఎవరికి ఇవ్వాలని, ఎవరికి ఇవ్వొద్దనే దానిపై చర్చించనున్నారు. గూగుల్ డేటా, శాటిలైట్ ఇమేజ్ ఆధారంగా సాగు విస్తీర్ణం లెక్కించనున్నట్లు తెలుస్తోంది. సాగు చేసే వారికే రైతు భరోసా ఇస్తామని ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. వ్యవసాయ అధికారులు కూడా రైతుల పేర్లు, సర్వే నంబర్ల వారీగా గ్రామాల్లో సాగు వివరాలు సేకరిస్తున్నారని తెలిపారు. ఆ తర్వాతే రైతుల ఖాతాల్లో రైతు భరోసా వేయనున్నట్లు మంత్రి తెలిపారు.
- Advertisement -