Monday, November 18, 2024

జమ్మూ సరిహద్దులో ఆయుధాలు స్వాధీనం

- Advertisement -
- Advertisement -

 

dropped arms seized

శ్రీనగర్: జమ్మూ ఇంటర్నేషనల్ బోర్డర్ (ఐబి) సమీపంలో పాకిస్తాన్  డ్రోన్ ద్వారా ఉగ్రవాదుల కోసం జారవిడిచిన మందుగుండు సామగ్రిని ఇక్కడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు, గురువారం  (18ఆగస్టు2022) నాడు అధికారులు తెలిపారు. జైల్లో ఉన్న లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) కమాండర్ అందించిన సమాచారం ఆధారంగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని, సరుకు దొరికిన ప్రదేశంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో  అతడు మరణించాడని వారు తెలిపారు. మహ్మద్ అలీ హుస్సేన్ అలియాస్ ఖాసీం అలియాస్ జహంగీర్ ఒక పోలీసు రైఫిల్ లాక్కొని, బుధవారం ఆయుధాలను కనుగొనడానికి అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని ప్రదేశానికి తీసుకెళ్లిన పోలీసు బృందంపై కాల్పులు జరిపిన తర్వాత కాల్చి చంపబడ్డాడని ఏడిజిపి ముఖేష్ సింగ్ వివరించారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ ఆయుధాల ప్యాకెట్‌ను తెరిచి చూడగా అందులో ఒక ఏకే రైఫిల్, ఒక మ్యాగజైన్, 40 రౌండ్లు, ఒక పిస్టల్, రెండు పిస్టల్ మ్యాగజైన్‌లు, 10 రౌండ్లు, రెండు గ్రెనేడ్లు ఉన్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News