- Advertisement -
న్యూఢిల్లీ : భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేసిన దావాలను బ్రిటన్‌కు చెందిన కెయిర్న్ ఎనర్జీ ఉపసంహరించుకుంటోంది. ప్రభుత్వ వసూలు చేసిన రెట్రోస్పెక్టివ్ టాక్స్ రూ.7900 కోట్లు వెనక్కి ఇవ్వాలంటూ అమెరికా, ప్యారిస్, నెదర్లాండ్ కోర్టుల్లో వేసిన కేసులను కంపెనీ విత్‌డ్రా చేసుకుంటోంది. ఇది తుది దశలో ఉంది. గత ఏడు సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ పన్ను వివాదం కేసులో భారత ప్రభుత్వంతో పరిష్కారం దిశగా కెయిర్న్ ఎనర్జీ ఈ చర్యలు చేపట్టింది.
- Advertisement -