Wednesday, January 22, 2025

పాలు త్రాగే వారిలో కూడా కాల్షియం లోపం.. కారణాలివే

- Advertisement -
- Advertisement -

మనమందరం ఆరోగ్యంగా ఉండడానికి చిన్నప్పటి నుంచి పాలు త్రాగుతున్నాం. కొందరైతే రాత్రి సమయంలో కూడా పాలు తాగుతారు. పాలు ఆరోగ్యంగా ఉండడానికి ఎంతో మేలు చేస్తుంది. పాలు త్రాగడం వల్ల కాల్షియం లోపం పోయి ఎముకలు బలపడతాయి. అయితే కొన్ని సార్లు పాలు తాగే వారిలో కూడా కాల్షియం లోపంతో బాధపడతారు. ఈ విషయాన్ని స్వయంగా వైద్యులే చెబుతున్నారు. పాలు తాగే వారు కాల్షియం రూపంతో ఎలా బాధపడుతున్నారని మీకు ఆశ్చర్యం కలగవచ్చు. దానికి ప్రధాన కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

త్రాగే పాలు నాణ్యతగా లేకుంటే శరీరానికి తగినంత కాల్షియం లభించదు. దీంతో పాల నాణ్యత చూసుకోవాలి. ఇది కూడా కాల్షియం లోపానికి కూడా కారణం కావచ్చు. కొంతమందికి పాలలో కాల్షియం తగ్గే లాక్టోస్ అసహనం అంటే జీర్ణ సమస్యలు ఉండవచ్చు. దీనివల్ల చాలామందికి పాలు తాగడం వల్ల పూర్తి ప్రయోజనాలు అందవు. తాగినప్పటికీ వాటిలో కాల్షియం లోపం ఉంటుంది. శరీరంలో విటమిన్ డి వంటి ఇతర పోషకాల లోపం ఉంటే కాల్షియం తగ్గుతుంది. దీంతో పాలు తీసుకున్న వారిలో కూడా కాల్షియం లోపం కనపడుతుంది. కనుక కాలుష్యం లోపాన్ని భర్తీ చేసి ఇతర ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News