Monday, January 20, 2025

టిఎంసి నేత హత్యపై సిబిఐ దర్యాప్తు

- Advertisement -
- Advertisement -

 

కోల్‌కత: తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు భడూ షేక్ హత్యపై సిబిఐ దర్యాప్తునకు కలకత్తా హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. పశ్చిమ బెంగాల్‌లోని భీర్బమ్ జిల్లాలో ఈ హత్యకు ప్రతీకారంగా జరిగినట్లు అనుమానిస్తున్న దహనకాండలో తొమ్మిది మంది వ్యక్తులు సజీవంగా దహనమయ్యారు. బోగ్తల్ గ్రామంలో తొమ్మిదిమంది వ్యక్తుల సజీవదహనం ఘటనపై సిబిఐ దర్యాప్తునకు హైకోర్టు ఇదివరకే ఆదేశాలు జారీచేసింది. ఈ రెండు సంఘటనలకు ఒకదానితో ఒకటి సంబంధం ఉన్నందున భడూ షేక్ హత్యకు కూడా సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాలని పిటిషనర్లు శుక్రవారం చీఫ్ జస్టిస్ ప్రకాశ్ శ్రీవాస్తవ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట అభ్యర్థించడంతో కోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. భడూ షేక్ హత్యతో పాటు బోగ్తల్ గ్రామంలో గృహదహనం, హత్యల కేసును కూడా సిబిఐ దర్యాప్తు చేయాలని ఆదేశిస్తున్నట్లు ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News