Monday, January 20, 2025

బీర్‌భూం ఘటన కేసు సిబిఐకి అప్పగింత..

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా: బీర్‌భూం ఘటన కేసును కోల్ కతా హైకోర్టు సిబిఐకి అప్పగించింది. ఏప్రిల్ 7లోగా నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో దర్యాప్తు ప్రారంభించిన సిబిఐ సంఘటనాస్థలాన్ని పరిశీలించింది. టిఎంసి నేత బదుషేక్ హత్యతో రాంపూర్ హట్ లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. బదుషేక్ హత్యతో ప్రత్యర్థుల ఇళ్లకు టిఎంసి కార్యకర్తలు నిప్పుపెట్టారు. ఈ ఘటన పశ్చిమబెంగాల్ లోని బీర్‌భూం జిల్లాలో చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో 8 మంది సజీవదహనమయ్యారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది. దీనిపై బెంగాల్ సిఎం మమత తీవ్రంగా స్పందించింది. ఈ ఘోరానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని పోలీసు అధికారులను ఆదేశించింది.

Calcutta HC orders CBI probe into Birbhum Violence

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News