Monday, January 20, 2025

ఒబిసి సర్టిఫికెట్ల రద్దు

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో 2010 తరువాత జారీ అయిన ఇతర వెనుకబడిన తరగతుల (ఒబిసిల) సర్టిఫికేట్లు అన్నిటినీ కలకత్తా హై కోర్టు కొట్టివేస్తూ బుధవారం కీలక తీర్పు ఇచ్చింది. ఒబిసి సర్టిఫికేట్ల జారీని సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌పై న్యాయమూర్తులు తపబ్రత చ క్రవర్తి, రాజశేఖర్ మంథాతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. 1993 నాటి పశ్చిమ బెంగాల్ వెనుకబడిన తరగతుల క మిషన్ చట్టం ప్రాతిపదికగా పశ్చిమ బెంగాల్ వెనుకబడిన తరగతుల కమిషన్ ఒబిసిల సరికొత్త జాబితాను రూపొందించాలని కోర్టు ఆదేశించింది. 2010 తరువాత సిద్ధం చేసిన ఒబిసి జాబితా ‘అక్రమం’ అని హైకోర్టు బెంచ్ అభివర్ణించింది. పశ్చిమ బెంగాల్ వెనుకబడిన త రగతులు (షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ జాతులు కానివి) (సర్వీసె స్, పోస్ట్‌లలో ఖాళీల రిజర్వేషన్) చట్టం 2012లోని సెక్షన్ 2హెచ్, 5, 6,సెక్షన్ 16, షెడ్యూల్ 1, 3లను ‘రాజ్యాంగవిరుద్ధమైనవి’గా హైకోర్టు కొట్టివేసింది.

1993 నాటి (పశ్చిమ బెంగాల్ వెనుకబడిన తరగతుల కమిషన్) చట్టాన్ని తోసిరాజని 2010 తరువాత ఇచ్చిన ఒబిసి సర్టిఫికేట్లు అన్నీ ఇచ్చినట్లు (దాఖలైన) పిల్ ఆరోపించింది. అ సలు బిసిలైనవారికి సముచిత సర్టిఫికేట్లు ఇవ్వలేదు. బుధవారం నాటి డివిజన్ బెంచ్ నిర్ణయం 2010 తరువాత ఇచ్చిన ఒబిసి సర్టిఫికేట్లు అన్నిటినీ రద్దు చేసింది. 2010 ముందు ఒబిసి సర్టిఫికేట్ పొందినవారు కలకత్తా హెచ్‌సి విచారణ ప్రభావానికి లోను కారు’అని న్యాయవాది సుదీప్త దాస్‌గుప్తా తెలియజేశారు. 2010, 2024 మధ్య జారీ అయిన అన్ని ఒబిసి సర్టిఫికేట్లు రద్దు అయ్యాయి. ఇప్పుడు ఈ సర్టిఫికేట్లు ఉన్నవారికి కల్పించిన వివిధ పథకాల ప్రయోజనాలను వ్యక్తులు పొందవచ్చు. అయితే, ఇప్పటికే సర్వీసులో ఉన్న లేదా రిజర్వేషన్ ప్రయోజనం పొందిన లేదా రాష్ట్ర ఎంపిక ప్రక్రియ దేనిలోనైనా నెగ్గిన ఉద్వాసిత తరగతలు పౌరుల సర్వీసులపై ఈ ఉత్తర్వు ప్రభావం ఉండదని హైకోర్టు స్పష్టం చేసింది. ఇది ఇలా ఉండగా, పిటిషన్లు సవాల్ చేయని, 2010 ముందు ఒబిసిల 66 తరగతులను వర్గీకరిస్తూన్న రాష్ట్ర ప్రభుత్వ ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వుల విషయంలో జోక్యం ఏదీ లేదని కూడా కోర్టు వివరించింది.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ పరిణామంపై స్పందిస్తూ, తాను హైకోర్టు ఉత్తర్వును అంగీకరించబోనని చెప్పారు. ఆమె ఈ సందర్భంగా బిజెపిని దుయ్యబట్టారు. ‘మేము బిజెపి ఉత్తర్వును అంగీకరించం. ఒబిసి రిజర్వేషన్ కొనసాగుతుంది. వారి పట్టుదలను ఊహించండి. ఇది దేశంలో కళంకిత అధ్యాయం. ఇది నేను చేసింది కాదు. ఉపేన్ బిశ్వాస్ దీనిని చేశారు’ అని ఆమె చెప్పారు. ‘ఒబిసి రిజర్వేషన్ అమలుకు ముందు సర్వేలు నిర్వహించడమైంది. గతంలో కూడా కేసులు దాఖలయ్యాయి. కానీ దీనిలో ఫలితం రాలేదు. బిజెపి పాలిత రాష్ట్రాల్లోని విధానాల గురించి వారు ఎందుకు మాట్లాడరు’ అని మమత అన్నారు. మైనారిటీలు ఎలా తపశిలి రిజర్వేషన్ లాక్కుంటారని, అది రాజ్యాంగ సంక్షోభానికి దారి తీస్తుందని ప్రధాని (మోడీ) మాట్లాడుతున్నారు’ అని కూడా తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) చీఫ్ పేర్కొన్నారు. ‘మైనారిటీలు తపశిలి లేదా ఆదివాసీ రిజర్వేషన్‌ను ఎన్నటికీ ముట్టుకోరు. కానీ ఈ తప్పుడు వ్యక్తులు (బిజెపి) ఏజెన్సీల ద్వారా తమ పని జరిపించుకుంటుంటారు’ అని మమత అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News