Thursday, January 23, 2025

లైంగిక దాడి కేసులో కలకత్తా హైకోర్టు తీర్పుపై స్పందించిన సుప్రీంకోర్టు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : బాలికలు తమ లైంగిక వాంఛలను అదుపులో పెట్టుకోవల్సి ఉంటుందని కలకత్తా హైకోర్టు వెలువరించిన తీర్పు వివాదాస్పదం అయింది. దీనిపై అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తనంత తానుగా స్పందించి, సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ విషయంపై తమ విచారణ మే నెల రెండవ తేదీన నిర్వహిస్తామని న్యాయమూర్తులు అభయ్ ఎస్ ఓకా, ఉజ్వల్ భూయాన్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం తెలిపింది. ఓ లైంగిక దాడి కేసులో కలకత్తా హైకోర్టు తీర్పులో వెలువరించిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. 2023 అక్టోబర్ 18వ తేదీన వెలువరించిన హైకోర్టు తీర్పుపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా అప్పీలు చేసుకుంది.

మే 3వ తేదీనే ఈ పిటిషన్‌పై కూడా విచారణ ఉంటుందని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. హైకోర్టు వ్యాఖ్యలను డిసెంబర్ 8న ధర్మాసనం తప్పుపట్టింది. హైకోర్టు వ్యాఖ్యలు పూర్తిగా అభ్యంతరకరం, అవాంఛనీయం అని తెలిపారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలకు సంబంధించి సుప్రీంకోర్టు తనకు తానుగా పిటిషన్ ప్రక్రియను అసాధారణ రీతిలో చేపట్టింది. “యుక్తవయస్సుకు వచ్చిన మహిళలు కోరికలను అదుపులో పెట్టుకోవాలి. రెండు నిమిషాల స్వల్పకాలిక సుఖం అనుభవించే స్వేచ్ఛ ఆమెకు దక్కితే చివరికి నష్టపొయ్యేది ఎవరు? ఆమెనే’ అని కలకత్తా హైకోర్టు వ్యాఖ్యానించింది. లైంగిక దాడి కేసులో 20 సంవత్సరాల జైలుశిక్ష పడ్డ వ్యక్తి పెట్టుకున్న పిటిషన్‌పై విచారణ క్రమంలో హైకోర్టు స్పందించింది. శిక్ష పడ్డ వ్యక్తిని నిర్దోషిగా ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News