Monday, January 20, 2025

సందేశ్‌ఖాలీ నేరాలపై సిబిఐ దర్యాప్తుకు ఆదేశించిన కలకత్తా హైకోర్టు

- Advertisement -
- Advertisement -

కోల్‌కత: పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో మహిళలపై నేరాలు, బలవంతపు భూ కబ్జాల ఆరోపణలపై సిబిఐ దర్యాప్తునకు కలకత్తా హైకోర్టు బుధవారం ఆదేశించింది. సిబిఐ దర్యాప్తును న్యాయస్థానం పర్యవేక్షిస్తుందని చీఫ్ జస్టిస్ టిఎస్ వివజ్ఞానం నేతృత్వంలోని డివిజన్ బెంచ్ బుధవారం ప్రకటించింది. వ్యవసాయ భూములను చట్టవిరుద్ధంగా చేపల చెరువులుగా మార్చడంపై లోతుగా దర్యాప్తు జరిపి సమగ్ర నివేదికను సమర్పించాలని సిబిఐని డివిజన్ బెంచ్ ఆదేశించింది. మహిళలపై నేరాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై కూడా దర్యాప్తు జరిపి నివేదికను ఇవ్వాలని సిబిఐని కోరింది.

కేసు తదుపరి విచారణను మే 2వ తేదీకి వాయిదా వేసిన డివిజన్ బెంచ్ ఆలోగా నివేదికను సమర్పించాలని సిబిఐని ఆదేశించింది. రేషన్ పంపిణీ కుంభకోణానికి సంబంధించిన కేసులో తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షాజహాన్ షేక్‌ను ప్రశ్నించేందుకు జనవరి 5న సందేశ్‌ఖాలీకి వెళ్లిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారుల బృందంపై దాడి జరిగింది. తదనంతర పరిణామాల నేపథ్యంలో సందేశ్‌ఖాలీలో షాజహాన్ షేక్, అతని అనుచరులు అక్కడి మహిళలపై అత్యాచారాలకు, భూ కబ్జాలకు పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News