Wednesday, January 22, 2025

బీర్భూమ్ హింసాకాండపై కలకత్తా హైకోర్టు స్వీయ విచారణ

- Advertisement -
- Advertisement -

 


కోల్‌కతా : పశ్చిమబెంగాల్ లోని బీర్భూమ్ జిల్లాలో చెలరేగిన హింసాకాండపై కలకత్తా హైకోర్టు స్వీయ విచారణ జరుపుతోంది. దుండగులు దాదాపు 12 ఇళ్లను తగులబెట్టి బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. ఓ ఇంటిలో నివసిస్తున్న వారిని నిర్బంధించి ఆ ఇంటిని తగుల బెట్టడంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు.

ఈ హింసాకాండపై విచారణ జరపాలని హైకోర్టు నిర్ణయించింది. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వం లోని ధర్మాసనం బుధవారం మధ్యాహ్నం విచారణ ప్రారంభించనున్నది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఎంసీ నేత ఒకరు హత్యకు గురైన నేపథ్యంలో ఈ హింసాకాండ చెలరేగింది. దీనిపై దర్యాప్తుకు రాష్ట్రప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ సంఘటనపై సవివర నివేదికను సమర్పించాలని రాష్ట్రప్రభుత్వాన్ని కేంద్ర హోం మంత్రిత్వశాఖ కోరింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News