Thursday, January 23, 2025

ఐ అండ్ పిఆర్ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల క్యాలెండర్ ఆవిష్కరణ

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : సమాచార పౌర సంబంధాలశాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం 2024 క్యాలెండర్‌ను ఆ శాఖ స్పెషల్ కమిషనర్ కె. అశోక్ రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు. ఈ మేరకు సమాచార శాఖ కార్యాలయం లో జరిగిన కార్యక్రమంలో ఉన్నతాధికారుల సమక్షంలో ఆవిష్కరించిన కమిషనర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంలో సమాచార శాఖ ప్రాముఖ్యతను , ఉద్యోగుల విధి నిర్వహణ బాధ్యతలను సిబ్బందికి సూచించారు. తన శాఖకు గుర్తింపు తీసుకువచ్చే విధంగా అధికారులు, సిబ్బంది కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు డి. జితేందర్, కార్యదర్శి కె. అనిల్ కుమార్, ట్రెజరర్ టి. దుర్గా ప్రసాద్ ఉపాధ్యక్షులు జి. శ్రీలతాదేవి, ఉమేష్ బాజ్పేయి, జాయింట్ సెక్రటరీ ఎం. మీనాక్షి, ఆర్.నరేష్, సి.నాగరాజు పబ్లిసిటీ సెక్రటరీ వి. ఇందిర, ఆర్గనైజింగ్ సెక్రటరీ పి. రాజు,ఇపి మెంబర్స్, ఎస్. సంగీత, టి.స్వర్ణలత ,ఎన్.రాజ్‌కుమార్ , ఎంఏ మాజీద్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News