Sunday, December 22, 2024

అమెరికాలో కేరళ కుటుంబం విషాదాంతం… భర్తే హంతకుడు!

- Advertisement -
- Advertisement -

కాలిఫోర్నియాలోని శాన్ మటియో పట్టణంలో స్థిరపడిన కేరళకు చెందిన భార్యాభర్తలు, వారి కవల పిల్లలు అనుమానాస్పద పరిస్థితుల్లో కన్నుమూసిన ఉదంతంలో భర్తే హంతకుడని పోలీసులు అనుమానిస్తున్నారు. కేరళకు చెందిన ఆనంద్ హెన్రీ (37), అతని భార్య అలైస్ బెంజీగర్ (36), వారి కవల పిల్లలు చనిపోయారు. తల్లిదండ్రులు తుపాకీ కాల్పుల్లో మరణించగా, కవల పిల్లల ఒంటిపై గాయాలేమీ లేవు. ఈ దిశగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు ఆశ్చర్యపోయే నిజాలు తెలిశాయి.

ఈ కేసులో ఆనంద్ హెన్రీయే నిందితుడని పోలీసులు అనుమానిస్తున్నారు. భార్యను కాల్చి చంపిన ఆనంద్, తానూ కాల్చుకుని చనిపోయాడని పోలీసులు చెబుతున్నారు. భార్యపై పలుమార్లు కాల్పులు జరిపినట్లుగా ఆమెపై ఒంటిపై తూటాల గాయాలు ఉన్నాయి. కాగా ఆనంద్ శరీరంపై ఒకే ఒక్క తూటా గుర్తు ఉంది. ఇక నాలుగేళ్ల వయసున్న కవల పిల్లలకు విషమిచ్చి చంపినట్లు అనుమానిస్తున్నారు.

ఆనంద్, అలైస్ ల మృతదేహాల పక్కనే పడి ఉన్న ఓ హ్యాండ్ గన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ గన్ ఆనంద్ పేరుపై రిజిష్టరై ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News