Saturday, November 23, 2024

కుల వివక్షను నిషేధించే బిల్లును ఆమోదించిన కాలిఫోర్నియా సెనేట్

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: రాష్ట్రంలో కులాల ఆధారంగా వివక్షను చట్ట విరుద్ధం చేసే బిల్లును కాలిఫోర్నియా రాష్ట్ర సెనేట్ 34- 1 ఓట్ట తేడాతో ఆమోదించింది. రాష్ట్ర అసెంబ్లీ బిల్లును ఆమోదించి, గవర్నర్ గావిన్ న్యూసోమ్ దానిపై సంతకం చేస్తే, కులాన్ని రక్షించే మొదటి రాష్ట్రంగా కాలిఫోర్నియా అవతరిస్తుంది.

సెనేటర్ ఆయిషా వహాబ్ మార్చిలో ప్రవేశపెట్టిన ఎస్‌బి 403 ఇప్పటికే అమలులో ఉన్న చట్టానికి రక్షిత వర్గంగా కులాన్ని జోడిస్తుంది. కాలిఫోర్నియా రాష్ట్రంలోని ప్రజలందరికీ పూర్తి, సమానమైన వసతులు, ప్రయోజనాలు, సౌకర్యాలు, అన్ని వ్యాపార సంస్థలలో అధికారాలు లేదా సేవలను ఉన్రుహ్ పౌర హక్కుల చట్టం వీలుకల్పిస్తుంది. కాలిఫోర్నియా సెనేట్ జ్యుడీషియరీ కమిటీ ఏప్రిల్‌లో ఎస్‌బి 403ని ఏకగ్రీవంగా ఆమోదించిన కొద్ది వారాల తర్వాత ఈ అభివృద్ధి జరిగింది. ఇది ఈ సంవత్సరం ఆరంభంలో కుల వివక్షను నిషేధించే సీటెల్ సిటీ కౌన్సిల్ చారిత్రాత్మక చట్టాన్ని కూడా అనుసరిస్తుంది. భారతీయఅమెరికన్ క్షమా సావంత్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సీటెల్ సిటీ కౌన్సిల్ 61 ఓట్ల తేడాతో ఆమోదించింది. కాలిఫోర్నియా రాష్ట్ర సెనేట్‌కు ఎన్నికైన తొలి ఆఫ్ఘన్ అమెరికన్, ముస్లిం అయిన వహాబ్ 10వ జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాలిఫోర్నియా విభిన్న ఆసియా జనాభాకు నిలయంగా ఉంది.

బిల్లును ప్రవేశపెడుతూ, అమెరికాలో కుల ఆధారిత పక్షపాతాలు ఉన్నాయని, దేశంలో పెరుగుతున్న వైవిధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వివక్షపై అవగాహన పెంచుకోవడం అవసరమని ఆయిషా వాహబ్ అన్నారు. ఈ బిల్లు ప్రతిపాదకులలో ఒకరైన పౌర హక్కుల సంస్థ ఈక్వాలిటీ ల్యాబ్స్ ప్రకారం కాలిఫోర్నియాలో సాంకేతికత, విద్య, నిర్మాణం, రెస్టారెంట్‌లు, గృహోపకరణాలు, వైద్యంతో సహా పరిశ్రమలన్నింటిలో కుల వివక్షత కనిపిస్తోంది.

అమెరికాలోని అనేక హిందూ వర్గాలు ఎస్‌బి 403కి తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశాయి. కాలిఫోర్నియా వివక్ష రహిత పాలసీకి ‘కులాన్ని’ ఇది ప్రత్యేకంగా జోడించింది. పబ్లిక్ పాలసీలో కులాన్ని క్రోడీకరించడం అమెరికాలో హిందూఫోబియాకు మరింత ఆజ్యం పోయగలదని చాలా మంది భయపడుతున్నారు. హిందూ అమెరికన్ ఫౌండేషన్ తన ప్రకటనలో ఈ బిల్లును వ్యతిరేకించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News