Wednesday, January 22, 2025

వ్యవసాయ శాఖ సేవల పరిశీలనకు కాల్ సెంటర్

- Advertisement -
- Advertisement -

Call center services of Department of Agriculture

హైదరాబాద్: హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ లోని రైతుబంధు సమితి అధ్యక్షుడి కార్యాలయంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ శాఖ కాల్ సెంటర్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి,  రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డిలు  బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, శాసనమండలి సభ్యులు ఎల్.రమణ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రైతుబంధు, రైతుభీమా అమలు, పంటల వైవిధ్యీకరణ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. వ్యవసాయ శాఖ దగ్గర రాష్ట్రంలోని 63 లక్షలమంది రైతుల ఫోన్ నంబర్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. రైతులు తమ సందేహాలు నివృత్తి చేసుకునేందుకు త్వరలో అందుబాటులోకి టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామన్నారు.

రైతులకు వ్యవసాయ శాఖ సేవలు మరింత అందుబాటులోకి తీసుకురావాలన్నదే ప్రభుత్వ ప్రయత్నమన్న ఆయన అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని రైతులకు మరింత చేరువ అవుతామని పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాకర్ల క్లస్టర్ పరిధిలో మరణించిన రైతు వెంకటేశ్వర్లు కుమారుడు రవీంద్రబాబుతో మంత్రి నిరంజన్ రెడ్డి రైతుభీమా అందిన వివరాలను కాల్ సెంటర్ నుండి మాట్లాడి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ చొరవతో రైతుభీమా ద్వారా అందిన సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతుభీమా సొమ్ము మీ కుటుంబానికి భరోసానిస్తుందని భావిస్తున్నామని మంత్రి తెలిపారు. త్వరలోనే రైతుబంధు నిధులు రైతుల ఖాతాలలోకి.. యధావిధిగా విడుదల చేయడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ, ఆర్థిక శాఖలకు ఈ మేరకు ఆదేశాలు జారీచేశారని చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News