హైదరాబాద్ : సరస్వతి అమ్మవారి పై ఓ వ్యక్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బాసరలో బంద్ కు పిలుపునిచ్చారు. దీంతో స్వచ్చందంగా బంద్ పాటిస్తున్న స్థానికులు. బంద్ తో నిర్మానుష్యంగా మారిన బాసర రోడ్లు. చదువుల తల్లిపై తప్పుడు వాఖ్యలు చేసిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికుల డిమాండ్. కాగా.. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు రెంజర్ల రమేష్‌ని అరెస్టు చేయాలని కోరుతూ మంగళవారం ఉదయం బాసర ఆలయం వద్ద చేపట్టన్ను ధర్నాకి జ్ఞాన సరస్వతి ఆటో యూనియన్ సంఘం తరపు మద్దతు తెలిపిన ఆటో సంఘం నాయకులు.
మంగళవారం బాసరలో ఆటోలు నడపమని తెలిపిన ఆటో యూనియన్ సంఘం అధ్యక్షుడు ఫసియుద్దిన్, కులమాతాలకు అతీతంగా అందరూ నడవాలని ఇలాంటి కుల విద్వేషాలు రెకెత్తించే పనులు చేయవద్దని కోరిన ఆటో యూనియన్ సంఘం సభ్యులు సరస్వతి అమ్మవారిపై వాడకూడని పదాలు వాడిన మూర్ఖుడి ని కఠినంగా శిక్షించాలని నేడు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ధర్నాకార్యక్రమం కలదు. ఇట్టి కార్యక్రమంలో అమ్మవారి భక్తులు,వ్యాపారస్తులతో ఆటో యూనియన్ సోదరులు కులమతాల కతీతంగా సోదరులు పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొని ఇట్టి మూర్ఖున్ని కఠినంగా శిక్షించాలని ధర్నాకు మద్దతు తెలపాలని అన్నారు.