Sunday, December 22, 2024

భర్తను ‘ కొజ్జొడా’ అనడం క్రూరత్వ చర్య: పంజాబ్,హర్యానా హైకోర్టు

- Advertisement -
- Advertisement -

చండీగఢ్: భర్తను ‘కొజ్జొడా’ అనడం క్రూరత్వం కిందికే వస్తుందంటూ పంజాబ్,హర్యానా హైకోర్టు ఓ జంటకు విడాకులు మంజూరు చేసింది. న్యాయమూర్తి సుధీర్ సింగ్, న్యాయమూర్తి జస్జిత్ సింగ్ బేడీ తో కూడిన డివిజన్ బెంచ్ ఓ మహిళ అప్పీలు కేసును విచారించి భర్తకు అనుగుణంగా విడాకుల తీర్పునిచ్చింది. అతడి తల్లి ఓ కొజ్జొడికి జన్మనిచ్చిందంటూ ఆమె అనడాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. భర్త తల్లి తన కోడలు అతడిని ‘కొజ్జొడా’ అనేదని తెలిపాక కోర్టు ఆయనకు డైవోర్స్ డిక్రీ ఇచ్చింది. అతడి భార్య తీరు క్రూరత్వం కిందికే వస్తుందని కోర్టు భావించింది.

విడాకుల వినతిలో అతడి భార్య అశ్లీల వీడియోలకు, మొబైల్స్ గేమ్స్ కు అలవాటుపడిందని పేర్కొన్నారు. అంతేకాక తమ లైంగిక కలాపాలను రికార్డు చేయమని కూడా భర్తతో ఆమె అనేదని కోర్టుకు తెలిపారు. పైగా సెక్స్ కనీసం 15 నిమిషాలు, ప్రతి రోజు రాత్రి మూడుసార్లు చేయాలని ఆమె కోరేదని తెలిపారు.  తనకు శారీరకంగా సుఖపెట్టడానికి అతడి సామర్థ్యం సరిపోదని కూడా ఆమె అనేదని అతడు కోర్టుకు తెలిపాడు. పైగా ఆమె ఇంకొకరిని పెళ్లి చేసుకుంటానని కూడా అనేదని తెలిపాడు. దాంతో కోర్టు భర్తకు అనుగుణంగా తీర్పునిచ్చింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News