Thursday, January 9, 2025

డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్

- Advertisement -
- Advertisement -

సుడిగాలి సుధీర్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘కాలింగ్ సహస్ర’. షాడో మీడియా ప్రొడక్షన్స్, రాధా ఆర్ట్ పతాకంపై అరుణ్ విక్కిరాలా దర్శకత్వంలో విజేష్ తయాల్, చిరంజీవి పమిడి, వెంకటేశ్వర్లు కాటూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. డాలీషా హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 1న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ.. “సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ సినిమాతో రాబోతున్నాను. సినిమా చూసి నచ్చితే ఓ పది మందికి చెప్పండి”అని అన్నారు.

దర్శకుడు అరుణ్ విక్కిరాలా మాట్లాడుతూ.. “ఇప్పటి వరకు ఇలాంటి కథతో ఇండియన్ స్క్రీన్ మీద సినిమా రాలేదు. సినిమాలో సుధీర్ అద్భుతంగా నటించారు” అని తెలిపారు. నిర్మాత విజేష్ త్యాల్ మాట్లాడుతూ.. “ట్రైలర్ చాలా బాగుంది. దర్శకుడు సినిమాను అద్భుతంగా తీశారు” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బెక్కం వేణుగోపాల్, డాలీషా, మోహిత్, మార్క్ కే రాబిన్, శశికిరణ్, నిరంజన్ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News