Friday, December 20, 2024

భార్యను భూతం, పిశాచి అని తట్టడం హింస కాదు

- Advertisement -
- Advertisement -

పాట్నా హైకోర్టు సంచలన తీర్పు

పాట్నా: విడిపోయిన దంపతులు పరస్పరం భూతం, పిశాచి వంటి పేర్లతో నీచమైన భాషలో తిట్టుకోవడాన్ని హింసగా పరిగణించలేమని పాట్నా హైకోర్టు అభిప్రాయపడింది. జార్ఖండ్‌కు పొరుగున ఉన్న బొకారో నివాసులు సహదేవ్ గుప్తా, ఆయన కుమారుడు నరేషన్ కుమార్ గుప్తా దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ వివేక్ చౌదరి నేతృత్వంలోని సింగిల్ జడ్జి బెంచ్ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. విడాకులు తీసుకున్న నరేష్ గుప్తా భార్య దాఖలు చేసిన ఫిర్యాదుపై బీహార్‌లోని నలంద జిల్లాకు చెందిన కోర్టులు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ తండ్రీకుమారులు పాట్నా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కట్నం కింద కారు కావాలని డిమాండు చేస్తూ తనను శారీరకంగా, మానసికంగా చిత్ర హింసలకు గుచి చేశారంటూ తన భర్త, మామగారిపై 1994లో నరేష్ గుప్తా భార్య నావడలో కేసు దాఖలు చేసింది.

అనంతరం..తండ్రీతనయుల అభ్యర్థన మేరకు ఈ కేసును నావడ నుంచి నలందకు బదిలీ చేశారు. 2008లో నలంద చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ తీర్పును ఇస్తూ తండ్రీకుమారులకు ఏడాది కఠిన కారాగార శిక్ష విధించారు. దీనిపై అదనపు సెషన్స్ కోర్టులో అప్పీలు చేసుకోగా పదేళ్ల తర్వాత తీర్పు వెలువడింది. ఈ మధ్య కాలంలో నరేష్ కుమార్ గుప్తాకు, ఆయన భార్యకు జార్ఖండ్ హైకోర్టు విడాకులు మంజూరు చేసింది. అదనపు సెషన్స్ కోర్టు కూడా తండ్రీకుమారులకు కారాగార శిక్షను ధ్రువీకరించడంతో వారిద్దరూ పాట్నా హైకోర్టులో అప్పీలు చేసుకున్నారు. దీనిపై విడాకులు తీసుకున్న మహిళ తరఫున న్యాయవాది హైకోర్టులో వాదిస్తూ 21వ శతాబ్దంలో ఒక హిళను ఆమె మామగారు, భర్త భూతం, పిశాచి అంటూ దూషించడం హింసగానే పరిగణించాలని కోరారు.

అయితే ఈ వాదనతో న్యాయమూర్తి ఏకీభవించలేదు. దాంపత్య సంబంధాలలో ముఖ్యంగా విఫలమైన వైవాహిక బంధాలలో భార్యాభర్తలిద్దరూ పరస్పరం నీచమైన భాషలో దూసించుకోవడం సర్వసాధారణమని న్యాయమూర్తి తెలిపారు. ఈ విధంగా పరస్పరం దూషించుకోవడం హింసగా పరిగణించలేమని ఆయన చెప్పారు. నిందితులందరూ తనను దారుణంగా హింసించారని, వేధించారని ఆమె చేస్తున్న ఆరోపణలను పరిగణనలోకి తీసుకుంటున్నామని, అయితే ఇందుకు తగ్గ నిర్ధిష్టమైన ప్రత్యేకమైన ఆరోపణలు ఏవీ లేవని న్యాయమూర్తి చెప్పారు. తండ్రీకుమారులపై దిగువ కోర్టు ఇచ్చిన తీర్పులను హైకోర్టు కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News