Wednesday, January 22, 2025

మోత్కూరులో ప్రశాంతంగా గ్రూప్ -4 పరీక్ష

- Advertisement -
- Advertisement -

మోత్కూరు: మోత్కూరులోని టీఎస్‌పీఎస్సీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గ్రూప్ 4 పరీక్షా కేంద్రంలో శనివారం పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మోత్కూరులోని సేక్రెడ్ హార్ట్ హైస్కూల్ లో పరీక్షా కేంద్రం ఏర్పాటు చేయగా 480 మంది అభ్యర్థులకు గాను 380 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ విధించి పోలీసులు అభ్యర్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి పరీక్షా కేంద్రంలోకి పంపించారు. మోత్కూరు మండలం పొడిచేడుకు చెందిన సంధ్యారాణి హాల్ టికెట్‌లో ఆమె పేరుకు బదులు ఎస్‌ఎస్‌సీ అని ఉండటం, మరో అభ్యర్థి సర్టిఫికెట్లలో పేరు బదులుగా అత్తింటి వారి పేరు ఉండగా పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ పరిశీలన చేసి వారితో అఫిడవిట్ రాయి ంచుకుని పరీక్షకు అనుమతించారు. ఆత్మకూరు(ఎం) మండలం పల్లెపహాడ్ కు చెందిన ముత్తినేని కు మార్ పది నిమిషాలు ఆలస్యంగా రావడంతో అతన్ని పరీక్షా కేంద్రంలోకి అను మతి ంచకపోవడంతో అతను నిరుత్సాహంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. అభ్యర్థుల కోసం 20 గదులను కేటాయించారు. రెండు పరీక్షా పేపర్లను అభ్యర్థులను ఎలాంటి ఆటంకాలు లేకుండా రాయడంతో పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని పరీక్షా కేంద్రం సీఎస్ ఎం.తానయ్య తెలిపారు. రూట్ ఆఫీసర్లుగా మోత్కూరు ఎంపీడీవో పోరెడ్డి మనోహర్ రెడ్డి, తహసీల్దార్ షేక్ అహ్మద్ వ్యవహరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News