Monday, December 23, 2024

ప్రశాంతంగా గ్రూప్. 4 పరీక్ష

- Advertisement -
- Advertisement -

హన్మకొండ ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) నిర్వహిస్తున్న గ్రూప్. 4 పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. శనివారం కలెక్టర్ సెయింట్ పీటర్స్ హైస్కూల్, గీతాంజలి డిగ్రీ కళాశాలలోని పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్ష నిర్వహణ తీరు తెన్నులను పరిశీలించారు. అభ్యర్థుల హాజరు గురించి ఆరా తీశారు. నిబంధనలకు అనుగుణంగానే నిర్ణీత సమయంలో ప్రశ్నా పత్రాలను తెరిచారా.. లేదా..? అన్నది నిర్ధారణ చేసుకున్నారు.

పరీక్షా కేంద్రాల్లోని గదులను సందర్శిస్తూ అభ్యర్థులకు అందుబాటులో ఉంచిన సదుపాయాలను గమనించి ముఖ్య పర్యవేక్షకులకు పలు సూచనలు చేశారు. జిల్లా వ్యాప్తంగా గ్రూపు. 4 పరీక్షలకు మొదటి పేపర్‌లో 47,973 మంది అభ్యర్థులకు 39,255 మంది హాజరు కాగా రెండవ పేపర్‌కు 47,973 మంది అభ్యర్థులకు 39,031 మంది హాజరయ్యారన్నారు. మొదటి పేపర్‌లో 8.83 శాతం, రెండవ పేపర్‌లో 81.36 శాతం నమోదైనట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News