Monday, December 23, 2024

ప్రశాంతంగా గ్రూప్.1 పరీక్షలు నిర్వహణ

- Advertisement -
- Advertisement -

మహబూబాబాద్ : జిల్లాలో గ్రూప్.1 పరీక్షలను ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించారు. ఈ మేరకు జిల్లాలోని మహబూబాబాద్, మరిపెడ, తొర్రూరు కేంద్రాల్లో 13 పరీక్షా కేంద్రాలలో 4046 మంది గ్రూప్. 1 పరీక్షలు రాసేందుకు అన్ని విధాలుగా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఆదివారం జిల్లా కేంద్రంలోని తక్షశిల హైస్కూల్, అనంతారం రహదారిలోని తెలంగాణ రాష్ట్ర మోడల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన గ్రూప్.1 పరీక్షా కేంద్రాలను కలెక్టర్ కె.శశాంక సందర్శించి నిర్వహణ తీరును పరిశీలించారు.

ఆయా పరీక్షా కేంద్రాలలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం మౌళిక వసతుల కల్పనకు చర్యలు తీసుకున్నామని, ప్రశాంత వాతావరణంలో సజావుగా జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించినట్లు కలెక్టర్ తెలిపారు. పరీక్షలు నిర్వహిస్తున్న సమయాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించేందుకు బాద్యతతో విధులు నిర్వహించేలా అధికారులను అదేశించామన్నారు.

అలాగే జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మానుకోటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రం వద్ద పోలీసులు నిర్వహిస్తున్న బందోబస్తును పరిశీలించారు. అక్కడ బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పన అధికారి రామకృష్ణ, జిల్లా పంచాయితీ అధికారి నర్మద, తహసిల్దార్లు విజయ్‌కుమార్, ఇమ్మనియెల్, మహ్మద్ గౌస్, డీ.టీ. వీరన్న, పోలీసు అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News