Sunday, December 22, 2024

మందుపాతరలను పసిగట్టే ‘హీరో ఎలుక’ మృతి

- Advertisement -
- Advertisement -

Cambodia Hero Rat died

నామ్‌పెన్: మందుపాతరలను పసిగట్టే హీరో ఎలుకగా పేరు పొందిన ‘మగావా’మరణించింది. గత వారం ఆఖరులో మరణించినట్టు బెల్జియంకు చెందిన అంతర్జాతీయ చారిటీ ఏపీఒపిఒ వెల్లడలించింది. ఆఫ్రికా జాతికి చెందిన ఈ భారీ ఎలుక మగావా వయసు ఎనిమిదేళ్లు. తన ఐదేళ్ల కెరీర్‌లో ఆగ్నేయాసియా దేశమైన కాంబోడియాలో నేలలో అమర్చిన వందకు పైగా మందుపాతరలను , ఇతర పేలుడు పదార్దాలను పసిగట్టడంతో అనేక మంది ప్రాణాలను కాపాడగలిగింది. దాదాపు 31 ఫుట్‌బాల్ కోర్టుకు సమానమైన 2,25,000 చదరపు మీటర్ల భూమిని మందుపాతల నుంచి వేరు చేయడానికి ఎంతో సహకరించింది. 71 మందుపాతరలను, 38 పేలని పేలుడు పదార్ధాలను కనుగొనగలిగింది. అందుకే దీన్ని హీరో ర్యాట్‌గా పిలిచే వారు. వశాబ్దాల అంతర్యుద్ధంలో కాంబోడియాలో మందుపాతరల పేలుడు వల్ల వేలాది మంది అవయవాలు కోల్పోయారు. కాంబోడియాకు చెందిన గనులు తొలగించే ప్రభుత్వేతర సంస్థ ఏపీఒపీవోకు ఈ ఎలుక ఎనలేని సేవలు అందించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News