Monday, December 23, 2024

పెట్రోల్ బంక్‌లో యువకుల వీరంగం

- Advertisement -
- Advertisement -

Came for petrol and threatened with a gun

మనతెలంగాణ, హైదరాబాద్ : పెట్రోల్ కోసం వచ్చిన ఓ యువకుడు వీరంగం సృష్టించిన సంఘటన బహదుర్‌పుర పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…బహదూర్‌పుర పరిధిలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపుకి పెట్రోల్ పోసుకునేందుకు ఇఫ్తికార్ వచ్చాడు. పెట్రోల్ పోసుకున్న తర్వాత డబ్బులు యూపిఐ ద్వారా పంపించాగా ఫేయిల్ అయింది. దీంతో తన వద్ద డబ్బులు లేవని యువకుడు పెట్రోల్ బంక్ సిబ్బందితో చెప్పాడు. డబ్బులు ఇవ్వాల్సిందిగా వారు కోరగా యువకుడికి, బంక్ సిబ్బంది మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఇఫ్తికార్ తన వద్ద ఉన్న తుపాకీని చూపించి భయాందోళనకు గురిచేశాడు, అంతేకాకుండా క్యాషియర్‌పై దాడి చేశాడు. తర్వాత ఫోన్ చేసి ఇద్దరు స్నేహితులను అక్కడికి పిలిపించాడు. వెంటనే పెట్రోల్ బంక్ వద్దకు ఇద్దరు రాగా వారితో కలిసి బంక్ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. బీరు సీసాలు పట్టుకుని పెట్రోల్ కోసం వచ్చిన వాహనాలపై దాడి చేశారు. దీంతో పెట్రోల్ బంక్ సిబ్బంది ఇఫ్తికార్‌ను పట్టుకోగా, మరో ఇద్దరు పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఇఫ్తికార్‌ను అదుపులోకి తీసుకున్నారు. పరారైన ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News