Sunday, December 22, 2024

కెమెరాల దొంగ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

camera thief arrested in hyderabad

ఓఎల్‌ఎక్స్‌లో అద్దెకి తీసుకుంటున్న నిందితుడు
అమెజాన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్
అదుపులోకి తీసుకున్న తుకారాంగేట్ పోలీసులు

హైదరాబాద్: ఖరీదైన కెమెరాలు అద్దెకు తీసుకుని కొట్టేస్తున్న నిందితుడిని తుకారాంగేట్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి పది కెమెరాలు, లెన్స్‌లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటి విలువ రూ.5,50,000 ఉంటుంది. నార్త్‌జోన్ డిసిపి చందనాదీప్తి తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వనపర్తి జిల్లా, న్యూటౌన్ కాలనీకి చెందిన గమ్‌గిడి కిరణ్‌కుమార్ యాదవ్ అమెజాన్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. వ్యసనాలకు బానిసగా మారిన కిరణ్ సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేశాడు. దీనికి ఓఎల్‌ఎక్స్‌లో ఖరీదైన కెమెరాలు అద్దెకు ఇవ్వడం చూశాడు. రోజుకు రూ.800లకు కెమెరాలు ఇస్తున్నట్లు గుర్తించాడు. ఈ క్రమంలోనే సికింద్రాబాద్‌కు చెందిన పాలిటెక్నిక్ చదువుకుంటున్న కొట్టె సాత్విక్ ఓఎల్‌ఎక్స్‌లో తన రెండు కెమెరాలను అద్దెకు ఇచ్చేందుకు పెట్టాడు. వాటిని చూసిన నిందితుడు ఫోన్ చేశాడు.

తనకు రెండు కెమెరాలు అద్దెకు కావాలని చెప్పడంతో నిజమని నమ్మిన బాధితుడు రోజుకు రూ.800 చొప్పున ఇచ్చేందుకు అంగీకరించారు. ఏప్రిల్27వ తేదీన నిందితుడు ఈస్ట్‌మారేడ్‌పల్లిలోని రత్నదీప్‌లేన్‌కు వచ్చిన బాధితుడి వద్ద నుంచి రెండు కెమెరాలు తీసుకున్నాడు. ఈ సమయంలో నిందితుడు తన పేరు పవన్‌కుమార్ అని చెప్పి నకిలీ ఐడి కార్డులను ఇచ్చాడు. తర్వాత నుంచి నిందితుడి మొబైల్ నంబర్ స్విచ్ ఆఫ్ అయ్యింది. దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు తుకారాం గేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇన్స్‌స్పెక్టర్ ఎల్లప్ప తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News