Wednesday, January 22, 2025

మంత్రి తుమ్మలతో ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ సమావేశం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో టిపిసిసి ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ సమావేశమయ్యారు.  డా. బిఆర్ అంబేడ్కర్ సచివాలయంలో శనివారం జరిగిన ఈ సమావేశంలో మల్కాజ్ గిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జిగా ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నాయకులు, కార్పొరేటర్లు, కంటెస్టెడ్ కార్పొరేటర్లతో సమావేశం అయ్యారు. రానున్న పార్లమెంటు ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఎలా పనిచేయాలనే విషయాలపై చర్చించారు. ఈ సమావేశంలో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుల పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News