Friday, November 22, 2024

మిజోరం, ఛత్తీస్‌గఢ్ తొలివిడతకు ముగిసిన ప్రచారం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సంగ్రామంలో మిజోరం, ఛత్తీస్‌గఢ్‌ల్లోని తొలి విడతకు ప్రచారం ఆదివారం ముగిసింది. మిజోరం లోని మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు, ఛత్తీస్‌గఢ్ లోని 20 స్థానాలకు మొదటి విడతలో నవంబర్ 7న పోలింగ్ జరగనుంది. ఈ పోలింగ్ జరగనున్న ప్రాంతాల్లో ప్రచారానికి తెరపడింది. ఈ రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 60 శాసనసభ స్థానాల్లో పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మిజోరంలో 40 అసెంబ్లీ స్థానాలుండగా, 8.57 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం 174 మంది బరిలో నిలబడ్డారు. అధికార మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్‌ఎఫ్), జోరం పీపుల్స్‌మూమెంట్, కాంగ్రెస్‌లు పూర్తి స్థాయిలో అభ్యర్థులను రంగంలో దించాయి.

బీజేపీ 23 మందిని, ఆమ్‌ఆద్మీపార్టీ నలుగురిని పోటీలో ఉంచగా, మరో 27 మంది స్వతంత్ర అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలుండగా, తొలివిడతలో 20 స్థానాల్లో పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ప్రధాన పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేశాయి. మిగతా 70 స్థానాలకు నవంబర్ 17 న మరో విడతలో నిర్వహించనున్నారు. ప్రస్తుతం జరుగుతోన్న 20 స్థానాల్లో ఎక్కువగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోనే ఉన్నాయి. తొలివిడత ఎన్నికలకు కొన్ని గంటల ముందే కాంగ్రెస్ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. ఛత్తీస్‌గఢ్ ఎన్నికల ప్రచారంలో ఇంతవరకు ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితరులు పాల్గొన్నారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News