Sunday, January 19, 2025

క్రికెటర్ ఉమ్రాన్ మాలిక్‌తో క్యాంపస్ యాక్టివ్‌వేర్ భాగస్వామ్యం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: భారతదేశంలోని అతిపెద్ద స్పోర్ట్స్, అథ్లెయిజర్ ఫుట్‌వేర్ బ్రాండ్‌లలో ఒకటైన క్యాంపస్ యాక్టివ్‌వేర్, తమ నైట్రోఫ్లై శ్రేణిని విడుదల చేయటం కోసం భారతదేశపు అత్యంత వేగవంతమైన బౌలర్ ఉమ్రాన్ మాలిక్‌తో భాగస్వామ్యం చేసుకున్నట్లు ప్రకటించింది. అసాధారణమైన ప్రదర్శన, శ్రేష్ఠత పట్ల తిరుగులేని నిబద్ధతకు ప్రసిద్ధి చెందిన ప్రఖ్యాత క్రికెటర్‌గా, ఉమ్రాన్ మాలిక్ క్రీడల పట్ల తన అభిరుచి, వాటిలో తన నైపుణ్యం ను క్యాంపస్ నైట్రోఫ్లై శ్రేణికి ప్రచారం కోసం తీసుకువచ్చాడు. ‘వై రన్ వెన్ యు కెన్ ఫ్లై’ అనే ట్యాగ్‌లైన్‌తో, నైట్రో టెక్నాలజీ ద్వారా ఆధారితమైన ఈ అధిక-పనితీరు గల షూలు, వినియోగదారులు తమ పరిమితులను అధిగమించడానికి, తమ అత్యుత్తమ పనితీరును సాధించడానికి వీలు కల్పిస్తాయి.

క్యాంపస్ యాక్టివ్‌వేర్ యొక్క నైట్రోఫ్లై రేంజ్ అనేది చురుకైన వ్యక్తుల పనితీరును ఒకే విధంగా పెంచడానికి రూపొందించబడిన అథ్లెటిక్ పాదరక్షల యొక్క అద్భుతమైన సేకరణ. ప్రఖ్యాత క్రికెటర్ ఉమ్రాన్ మాలిక్ చేత ప్రచారం చేయబడుతున్న ఈ షూస్ అత్యాధునిక సాంకేతికత, విప్లవాత్మక నైట్రో టెక్నాలజీ కలిగి వున్నాయి, ఈ అంశాలు వీటిని పోటీ సంస్థల నుండి ప్రత్యేకంగా నిలుపుతాయి. కుషనింగ్, రెస్పాన్సివ్‌నెస్, ఎనర్జీ ట్రాన్స్‌ఫర్‌తో, నైట్రోఫ్లై శ్రేణి ధరించిన వారికి వారి ప్రదర్శన పరంగా నూతన శిఖరాలను చేరుకోవడానికి సహకరిస్తుంది. ఉమ్రాన్ మాలిక్ మాదిరిగానే, క్రీడా ఔత్సాహికులు, చురుకైన వ్యక్తులందరినీ నైట్రోఫ్లై శ్రేణితో తదుపరి స్థాయి ప్రదర్శన అనుభవాలు పొందడానికి క్యాంపస్ యాక్టివ్‌వేర్ ఆహ్వానిస్తుంది.

నైట్రోఫ్లై శ్రేణిని విడుదల చేసిన సందర్భంగా క్యాంపస్ యాక్టివ్‌వేర్ సిఈఓ నిఖిల్ అగర్వాల్ మాట్లాడుతూ, “మా నైట్రోఫ్లై శ్రేణిని విడుదల చేయటం కోసం ఉమ్రాన్ మాలిక్‌తో భాగస్వామ్యం కావడం మాకు ఆనందంగా ఉంది. భారతదేశపు అత్యంత వేగవంతమైన బౌలర్‌గా ఉమ్రాన్ యొక్క అసాధారణ నైపుణ్యాలు, హద్దులు ఆదిగమించాలి. అసాధారణ పనితీరును సాధించాలనే మా బ్రాండ్ యొక్క సారాంశంతో సంపూర్ణంగా సరిపోతాయి. ఉమ్రాన్ ప్రచారంతో, నైట్రోఫ్లై అథ్లెటిక్ పాదరక్షల ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు చేస్తుందని మేము విశ్వసిస్తున్నాము. ఈ భాగస్వామ్యం మా కస్టమర్‌లకు వారి అంచనాలకు మించి సాధించటానికి వీలు కల్పించే అత్యుత్తమ ఉత్పత్తులను అందించడంలో మా అంకితభావానికి నిదర్శనం” అని అన్నారు.

“ఈ బూట్లు సాధారణ పాదరక్షలు మాత్రమే కాదు, వేగం, సౌకర్యం, నియంత్రణను అందించే గేర్లు” అని ఉమ్రాన్ మాలిక్ వెల్లడించారు. “అధునాతన నైట్రో టెక్నాలజీ ఆధారితమైన క్యాంపస్ యాక్టివ్‌వేర్ యొక్క నైట్రోఫ్లై శ్రేణి, మొత్తం పనితీరును కొత్త ఎత్తులకు తీసుకువెళుతుంది. అలాగే, ఇది కేవలం స్టైల్ గురించి మాత్రమే కాదు, పనితీరు, శ్రేష్ఠత గురించి, నైట్రోఫ్లై శ్రేణి ఆ తత్వశాస్త్రాన్ని ప్రతిబింబిస్తుంది.” అని ఉమ్రాన్ మాలిక్ జోడించారు.

నైట్రోఫ్లై శ్రేణి ఆవిష్కరణతో ఆవిష్కరణ పట్ల తన నిబద్ధతను క్యాంపస్ యాక్టివ్‌వేర్ ప్రదర్శిస్తూనే ఉంది. వినియోగదారులకు వారి ఫిట్‌నెస్, పనితీరు లక్ష్యాలను సాధించడానికి తగిన శక్తినిచ్చే అధిక-నాణ్యత యాక్టీవ్ వేర్ అందిస్తుంది. ఉమ్రాన్ మాలిక్‌తో భాగస్వామ్యం, మా విలువైన కస్టమర్‌లు క్రియాశీల జీవనశైలిని కొనసాగించడానికి అవసరమైన పనితీరు ఆధారిత ఉత్పత్తులను డెలివరీ చేయడంలో శ్రేష్ఠతను నిరంతరం కొనసాగించాలనే మా బ్రాండ్ యొక్క తిరుగులేని నిబద్ధతను పునరుద్ఘాటిస్తుంది. నైట్రోఫ్లై సేకరణ ఎంపిక చేసిన రిటైల్ స్టోర్స్, బ్రాండ్ వెబ్‌సైట్- www.campusshoes.comలో అందుబాటులో ఉంటుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News