Friday, December 20, 2024

చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్ బెర్త్ సాధిస్తుందా?

- Advertisement -
- Advertisement -

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 లో 59వ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య  రాత్రి 07.30 గంటలకు అహ్మదాబాద్ లోని  నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగనున్నది. స్కోర్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ అట్టడుగున ఉంది. పైగా ఎలిమినేట్ అయిన టీమ్స్…అంటే ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ కంటే దిగువన ఉంది. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ లోకి రవీంద్ర జడేజా గాయాల నుంచి కోలుకుని తిరిగొచ్చాడు. ఆయనిప్పుడు బౌలింగ్ డిపార్ట్మెంట్ లో ఉన్నాడు.

గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మొత్తం 6 మ్యాచ్ లు ఆడగా చెరో 3 గెలిచాయి.

గుజరాత్ టైటాన్స్ టీమ్(ప్రాబబుల్): శుభ్మన్ గిల్(కెప్టెన్), వృద్ధిమన్ సాహా, సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఉమర్జాయ్, రాహుల్ తేవతియ, షారూఖ్ ఖాన్, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిశోర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ.

చెన్నై సూపర్ కింగ్స్(ప్రాబబుల్స్): రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), ఎం.ఎస్.ధోనీ (వికెట్ కీపర్), అజింక్యా రహానె, డరిల్ మిచెల్, శివమ్ దుబే, మోయిన్ అలీ, రవీంద్ర జడేజా, మిచెల్ సంత్నర్, శార్దుల్ ఠాకుర్, రిచర్డ్ గ్లీసన్, తుషార్ దేశ్ పాండే.

CSK

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News