Thursday, January 23, 2025

పిల్లాడి చేతిలో విరాట్‌పై ప్లకార్డు: నెటిజన్ల ఆగ్రహం

- Advertisement -
- Advertisement -

 

న్యూస్ డెస్క్: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టే డియంలో జరిగిన ఐపిఎల్ మ్యాచ్ సందర్భంగా చోటుచేసుకున్న ఒక సంఘటన సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ఈ మ్యాచ్‌కు హాజరైన ఒక చిన్న పిల్లవాడి చేతిలోని ప్లకార్డు నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది. మీ కుమార్తె వామికను డేట్‌కు తీసుకెళ్లాలా విరాట్ అంకుల్ అంటూ ఆ పిల్లాడి చేతిలో ప్లకార్డులో రాసిన రాతల పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రేక్షకుల గ్యాలరీలో నిలుచున్న ఒక చిన్న పిల్లవాడి చేతిలోని ప్లకార్డులో ఇలా రాసి ఉంది..”హై విరాట్ అంకుల్…మే ఐ టేక్ వామిక ఔట్ ఆన్ ఎ డేట్” డాక్టర్ నిమో యాదవ్ అనే ట్విటర్ యూజర్ తన ట్విటర్ హ్యాండిల్‌లో ఆ పిల్లవాడి ఫోటోను షేర్ చేస్తూ..పిల్లల పెంపకంలో పెద్దవారిలో ఏదో లోపం కనపడుతోంది.

Also Read: ఊర్వశికి క్లీన్ బౌల్డ్ అయినా పంత్, జడేజా

ఈ ఫోటోను ఎందుకు కొందరు చూసి మురిసిపోతున్నారు అంటూ ఆయన కామెంట్ చేశారు. సోషల్ మీడియాలో ఈ పోస్టు వైరల్ అయింది. ఇప్పటి వరకు 6.6 లక్షల మందికి పైగా దీన్ని వీక్షించారు. ఆ పిల్లవాడి చేతిలో ఇలాంటి ప్లకార్డును పెట్టిన అతని తల్లిదండ్రులపైన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ పిల్లవాడి తప్పేమీ లేదని, తప్పంతా తల్లిదండ్రులదేనని, అతని చేత ఇలాంటి పని చేయించినందుకు వారిని వీక్షించాలని నెటిజన్లు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News