Wednesday, January 22, 2025

నన్ను జైళ్లో పెట్టొచ్చేమో కానీ… : మనీశ్ సిసోడియా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మనీశ్ సిసోడియాను గత నెల అరెస్టు చేశారు. ఆయన నేడు ఓ ట్వీట్ చేశారు. అందులో ‘దర్యాప్తు సంస్థ తనను కస్టడీలో ఉంచినప్పటికీ, తన స్థయిర్యాన్ని దెబ్బతీయలేదు’ అని పేర్కొన్నారు. ‘మీరు నన్ను జైలులో పెట్టి నాకు కష్టం కలిగించవచ్చునేమో, కానీ నా స్థయిర్యాన్ని దెబ్బతీయలేరు. స్వాతంత్య్ర సమరయోధులను సైతం బ్రిటిష్ వారు కష్టపెట్టారు. కానీ వారి ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీయలేకపోయారు’ అని పేర్కొన్నారు.

ఆయనను ఏడు రోజుల ఈడి కస్టడీకి అప్పగించిన తర్వాత ఈ ట్వీట్ వచ్చింది. తీహార్ జైలులో ఆయనను గురువారం కేంద్ర దర్యాప్తు ఏజెన్సీ ప్రశ్నించిన తర్వాత అరెస్టు చేసింది. దానికి ముందు ఆయన సిబిఐ కస్టడీలో ఉండేవారు. సిబిఐ ఆయనను ఫిబ్రవరి 26న అవినీతి ఆరోపణల కింద అరెస్టు చేసింది.

‘నేడు ఎలాంటి విధివిధానాలు పాటించకుండా ఎట్లాపడితే అట్లా అరెస్టులు చేయడం దర్యాప్తు సంస్థలకు అలవాటైపోయింది. ఈ తీరు మీద కోర్టులు కఠిన వైఖరిని అనుసరించాల్సిన తరుణం ఆసన్నమైంది’ అని సిసోడియా తరఫు న్యాయవాది దయాన్ కృష్ణ స్పెషల్ కోర్టులో తెలిపారు. ఇదిలావుండగా ఆమ్ ఆద్మీ పార్టీ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని దుయ్యబట్టింది. ‘తమ పార్టీని అప్రతిష్ఠ పాలుచేయడమే కేంద్ర ప్రభుత్వం లక్ష్యం’ అని పేర్కొంది. కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారంటూ ఎనిమిది ప్రతిపక్షాలు ప్రధాని మోడీకి గత వారమే రాశాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News