Thursday, January 23, 2025

హైదరాబాద్ జట్టు టాపర్ రాజస్థాన్ జట్టును ఎదుర్కోగలదా?

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నేడు ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్  స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ఐపిఎల్ 2024,  50వ మ్యాచ్ జరుగనున్నది. మంచి ఊపుమీదున్న(హై ఫ్లయింగ్) రాజస్థాన్ రాయల్స్ టీమ్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తలపడబోతున్నది. అయితే రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇప్పటికే ‘ప్లే ఆఫ్ బెర్త్’ ను సంపాదించుకున్నది.

హైదరాబాద్ జట్టు ఇటీవల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్  చేతుల్లో వరుసగా ఓడిపోయి కాస్త ఢీలా పడిపోయిందనిపిస్తోంది. రాజస్థాన్ రాయల్స్ ప్రస్తుతం 16 పాయింట్లతో ఉండగా, సన్ రైజర్స్ హైదరాబాద్ 10 పాయింట్లతో పట్టికలో ఉంది.  ఐదు గెలుపులు, నాలుగు ఓటములతో 5వ స్థానంలో హైదరాబాద్ జట్టు ఉంది. 2016లో ఛాంపియన్స్ గా ఉన్న ఈ జట్టు ఇప్పుడు ఢీలా పడిపోతూ వస్తోంది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ పరుగులను ఛేజ్ చేయలేకపోతున్నారు. ఈ స్థితిలో రాజస్థాన్ రాయల్స్ కమాండింగ్ పొజిషన్ లో ఉంది.

గమనించాల్సిన విషయం ఏమిటంటే ‘పవర్ ప్లే’ లో రాజస్థాన్ రాయల్స్ మంచి బౌలింగ్ యూనిట్ కలిగి ఉంది. రాజస్థాన్ రాయల్స్ కు చెందిన యుజ్వెంద్ర ఛాహల్ హైదరాబాద్ జట్టు 28 వికెట్లు తీసుకుని ఉన్నాడు. ఐపిఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఆడి సంజు శాంసన్ 791 పరుగులు చేశాడు.  హైదరాబాద్, రాజస్థాన్ జట్లు ఆడినప్పుడు భువనేశ్వర్ కుమార్ హైయెస్ట్ వికెట్ టేకర్ గా నిలవడానికి కేవలం 1 వికెట్ దూరంలో ఉన్నాడు.

అంచనా ప్రకారం రాజస్థాన్ రాయల్స్ గెలిచే ఛాన్స్ 51 శాతం ఉండగా, హైదరాబాద్ జట్టు గెలిచే ఛాన్స్ 49 శాతంగా ఉందనిపిస్తోంది.

SRH team

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News