Thursday, January 23, 2025

ఆత్మ గౌరవ భవనాలతో పేదల కడుపు నిండేనా? : బండి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కెసిఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తే హిందువులను నరికి చంపుతానన్న అక్బరుద్దీన్ మీకు చుట్టమైనట్లే..”అని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఆదివారం సిఖ్ విలేజ్ లో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన “ఆత్మీయ అభినందన సభ”కు బండి సంజయ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ మున్నూరు కాపు కుటుంబ సభ్యులందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. కులం అంటే అభిమానం ఉండాలే తప్ప కుల గుల ఉండకూడదు. కొంతమంది తమ స్వార్ధం కోసం కులం పేరు చెప్పుకుని పదవులు సంపాదిస్తుంటారు. అది కరెక్ట్ కాదన్నారు. ఆత్మగౌరవ భవనాలతో ఏం ఒరిగింది? కులంలో ఉన్న పేదలకు న్యాయం జరుగుతుందా? అని ఆయన ప్రశ్నించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర కేబినెట్ లో 27 మంది బిసిలకు, 12 మంది ఎస్సీలకు, ఎస్టీలకు అవకాశం కల్పించిన ఘనత ప్రధాని నరేంద్రమోడీకే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్య మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News