Friday, November 15, 2024

ఉక్రెయిన్‌పై దాడి ఆపండని రష్యా అధ్యక్షుడ్ని ఆదేశించగలమా ?

- Advertisement -
- Advertisement -

‘Can we direct Putin to stop war?’:CJI Ramana

వైరల్ అవుతున్న వీడియో నేపథ్యంలో సిజెఐ వ్యాఖ్య

న్యూఢిల్లీ : రష్యాతో యుద్ధం జరుగుతున్న ఉక్రెయిన్‌లో చిక్కుకు పోయిన భారతీయులను స్వదేశానికి రప్పించడంలో ప్రధాన న్యాయమూర్తి ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడంపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సిజెఐ) జస్టిస్ ఎన్వీరమణ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ పౌరుల రక్షణకు సంబంధించి సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్ విచారణలో భాగంగా ఆ వీడియో గురించి ఆయన ప్రస్తావించారు. “సోషల్ మీడియాలో నేను ఒక వీడియో చూశాను. ప్రధాన న్యాయమూర్తి ఏం చేస్తున్నారని అందులో ప్రశ్నిస్తున్నారు. ఈ దాడిని ఆపండని నేను రష్యా అధ్యక్షుడికి ఆదేశాలు ఇవ్వగలనా ? అంటూ ఆయన ఆశ్చర్యం వెలిబుచ్చారు.

ఉక్రెయిన్ సరిహద్దుల్లో చిక్కుకుపోయిన 200 మందికి పైగా భారతీయ విద్యార్థులను రక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణలో భాగంగా చీఫ్‌జస్టిస్ ఈ వ్యాఖ్య చేశారు. రొమేనియా నుంచి కాకుండా పోలాండ్, హంగరీ నుంచి విమానాలు నడుస్తున్నాయని, అక్కడ చిక్కుకున్న విద్యార్థుల్లో చాలామంది విద్యార్థినులు ఉన్నారని, వారికెలాంటి సౌకర్యాలు లేక ఇబ్బందులు కలుగుతున్నాయని జస్టిస్ ఎఎస్ బొపన్న, జస్టిస్ హిమకొహ్లీలతో కూడిన ధర్మాసనానికి పిటిషన్ తరఫు న్యాయవాది వివరించారు.

విద్యార్థులపై తమకు అన్నివిధాలా సానుభూతి ఉందని, కానీ కోర్టు ఏం చేయగలదు? అని ధర్మాసనం ప్రశ్నించింది. రొమేనియా సరిహద్దులో చిక్కుకున్న వైద్య విద్యార్థులను అక్కడ నుంచి స్వదేశానికి రప్పించడంలో సహకరించడానికి కృషి చేయాలని అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్‌కు న్యాయస్థానం సూచించింది. ఉక్రెయిన్ నుంచి విద్యార్థులను విమానాల ద్వారా స్వదేశానికి రప్పించే ఏర్పాట్లు కేంద్రం ముమ్మరం చేసింది. తక్షణం ఖర్ఖివ్‌ను విడిచిపెట్టి సమీపాన ఉన్న మూడు ప్రాంతాలకు కాలినడకతోనైనా చేరుకోవాలని భారత ప్రభుత్వం అక్కడి విద్యార్థులకు సూచించింది. అయితే ఖర్ఖివ్ నుంచి రాడానికి అక్కడి అధికారులు రైళ్లను ఎక్కనివ్వడం లేదని, తమను తంతున్నారని, విద్యార్థులు ఫిర్యాదు చేశారు. భారత ప్రభుత్వం నిర్దేశించిన మూడు గమ్యస్థానాలను చేరుకోడానికి కనీసం 11 నుంచి 16 కిమీ దూరం నడిచిరావలసి వస్తోందని చాలామంది విద్యార్థులు వాపోయారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News