Monday, December 23, 2024

మీ ముఖ్యమంత్రిని గుర్తుపడతారా?: కార్మికులను ప్రశ్నించిన రాష్ట్రపతి

- Advertisement -
- Advertisement -

Can you identify? President Murmu asks to Tripura workers

బమూటియా: మొట్టమొదటిసారి రెండు రోజుల పర్యటన నిమిత్తం త్రిపురను సందర్శించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నర్సింగఢ్‌లో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాన్ని(ఎన్‌ఎల్‌యు)ను బుధవారం ప్రారంభించారు. ఉదయం 11.15 గంటలకు అగర్తల చేరుకున్న ముర్ముకు విమానాశ్రయంలో ముఖ్యమంత్రి మాణిక్ సాహా, గవర్నర్ సత్యానారాయణ్ ఆర్య, కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ సహాయ మంత్రి ప్రతిమ భౌమిక్ స్వాగతం పలికారు. విమానాశ్రయంలో ఆమెకు త్రిపుర రాష్ట్ర రైఫిల్స్ గౌరవ వందనం సమర్పించాయి. ఐఎల్‌యును ప్రారంభించిన అనంతరం మోహన్‌పూర్ సబ్‌డివిజన్‌లోని దుర్గాబరి టీ ఎస్టేట్‌ను సందర్శించిన ముర్ము అకడ తేయాకు తోటల్లో పనిచేసే కార్మికులతో ముచ్చటించారు. మీ పిల్లల్ని స్కూలుకు పంపిస్తున్నారా, మీకు ఉచిత బియ్యం, ఇతర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు లభిస్తున్నాయా అంటూ వారిని ఆమె ప్రశ్నించారు. తన వెంట ఉన్న ముఖ్యమంత్రి సాహాను, స్థానిక ఎమ్మెల్యే కృష్ణధణ్ దాస్‌ను గుర్తుపడతారా అని ఆమె ప్రశ్నించగా కార్మికులు తెలుసని సమాధానమిచ్చారు. వారు స్థానికులని, ఎటువంటి సమస్య ఉన్నా వారిని సంప్రదించాలని ఆమె వారికి సూచించారు.

Can you identify? President Murmu asks to Tripura workers

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News