Monday, January 20, 2025

2024 లో 485000 మంది నిపుణులకు కెనడా ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

ఒట్టావా : కెనడా దేశంలో కీలక రంగాల్లో వృద్ధ జనాభాతో పాటు , కార్మికుల కొరత తదితర సమస్యల కారణంగా దేశంలో శాశ్వతంగా ఉండేవారికి ఆహ్వానం పలకడానికి సిద్ధమైంది. ఈమేరకు భారత్ వంటి దేశాల నుంచి అర్హులైన నైపుణ్యం కలిగిన కొత్తవారిని వచ్చే సంవత్సరం 485,000 మందిని, 2025 లో 500,000 మందిని తమ దేశంలో శాశ్వత నివాసులుగా ఉండేందుకు స్వాగతించడానికి నిర్ణయించింది. ఆరోగ్యభద్రత, రవాణా, గృహనిర్మాణం, తదితర కీలక రంగాల్లో వృద్ధ జనాభా ఉండడంతోపాటు కార్మికుల సమస్య వేధిస్తుండడంతో నూతన ఆవిష్కరణలకు, ఆర్థికాభివృద్ధికి, సహాయపడడానికి, స్థానిక వ్యాపారాలకు, సమాజాలకు సహాయపడడానికి వీలుగా నైపుణ్యం కలిగిన కొత్తవారికి స్వాగతం పలుకుతున్నామని , ఈ ఇమ్మిగ్రేషన్ విధానంతో కెనడా ఆర్థిక రంగం మరింత ముందుకు సాగుతుందని,

భావిపురోగతికి దోహదం చేస్తుందని కెనడా ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ , సిటిజెన్‌షిప్ మంత్రి మార్క్ మిల్లర్ పత్రికా సమావేశంలో వెల్లడించారు. గృహ నిర్మాణం, ఆరోగ్యభద్రత, మౌలిక సౌకర్యాల కల్పనలో ఎదురౌతున్న ఒత్తిడులను తులనాత్మకం చేస్తూ ఆర్థిక పురోభివృద్దికి ఊతం అందించేలా 2024-2026 ఇమ్మిగ్రేషన్ ప్రణాళికను ప్రదర్శించారు. దీనికి తోడు వచ్చే సంవత్సరం నుంచి తాత్కాలిక రెసిడెంట్ అడ్మిషన్లను క్రమబద్ధీకరణ చేయడానికి కెనడా ప్రభుత్వం యోచిస్తోంది. నైపుణ్యం కలిగిన కార్మికులకు, వ్యాపారవేత్తలకు, కుటుంబాలకు సంబంధించి కెనడాలో దాదాపు 100 విధాల ఇమ్మిగ్రేషన్ మార్గాలున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News