- Advertisement -
న్యూఢిల్లీ : భారతదేశంలోని కెనడా దౌత్యవేత్తలు అత్యధిక సంఖ్యలోనే తమ దేశానికి తరలివెళ్లారు. ఖలీస్థాన్ వివాదంతో భారత్ కెనడా మధ్య దౌత్య సంబంధాలకు గండి పడింది. ఇండియాలోని దౌత్య సిబ్బందిని తగ్గించుకోవాలని ఈ దశలో భారత ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు ఈ నెల 10వ తేదీవరకూ గడువు విధించింది. ఈ నేపథ్యంలోనే దౌత్యసిబ్బంది తరలింపు ప్రక్రియ వేగవంతం అయింది. పలువురు దౌత్య అధికారులు, సిబ్బందిని ముందుగా న్యూఢిల్లీ నుంచి తరలించారు. వీరికి తాత్కాలికంగా కౌలాలంపూర్, సింగపూర్‌ల్లో విధులను అప్పగించినట్లు కెనడాకు చెందిన సిటీవీ న్యూస్ తెలిపింది. దాదాపుగా 40 మంది దౌత్యవేత్తలను ఉపసంహరించుకోవాలని భారత ప్రభుత్వం ఆదేశించింది.
- Advertisement -