Wednesday, January 22, 2025

నిజ్జర్ హత్య కేసులో నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో

- Advertisement -
- Advertisement -

కెనడా: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో కెనడా పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న విషయంలో ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించారు. తమ దేశం స్వంతంత్ర, బలమైన న్యాయ వ్యవస్థ కలిగి ఉందన్నారు. తమ పౌరులను రక్షించడమే ప్రభుత్వ కర్తవ్యమని వ్యాఖ్యానించారు. ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోందన్నారు. నిజ్జర్ మృతి తర్వాత ఓ వర్గం అభద్రతతో జీవిస్తోందని తెలిపారు.

భారత జాతీయ దర్యప్తు సంస్థ(ఎన్ఐఏ) నిందితులుగా పేర్కొన్న చాలా మంది కెనడాలో స్థిరపడి భారత వ్యతిరేక కార్యకలాపాలు, ఖలిస్థానీ అనుకూల కార్యకలాపాలు కొనసాగిస్తున్న పలుమార్లు బహిర్గతం అయింది. వారికి పాకిస్థాన్ ఐఎస్ఐ నిధులు అందుతున్నాయని భారత్ ఆధారాలు ఇచ్చినా కెనడా , భారత్ కు అనుకూలం వ్యవహరించలేదు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News