Sunday, January 19, 2025

భారత్ పై ఆంక్షలు విధించేందుకు  సిద్ధమవుతున్న కెనడా!

- Advertisement -
- Advertisement -

ఒట్టావా: ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు గురైనప్పటి నుంచి కెనడా భారత్ తో పేచీకి దిగుతోంది. తాజాగా భారత్ పై ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతోందని తెలుస్తోంది. కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ ఆ భావం కలిగేలా వ్యాఖ్యలు చేశారు.

నిజ్జర్ హత్య కేసు అనుమానితుల జాబితాలో భారత్ హై కమిషనర్ సంజయ్ కుమార్ వర్మను చేర్చడంతో రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినబోతున్నాయి. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో నిజ్జర్ హత్య కేసు దర్యాప్తులో భారత్ సహకరించడంలేదని ఆరోపించారు. ఆరుగురు భారత దౌత్యాధికారుల్ని బహిష్కరించాలని నిర్ణయం కూడా తీసుకుంది. అంతేకాక తాజాగా గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తో కలిసి భారత ఏజెంట్లు ఖలిస్థానీ అనుకూలురను లక్ష్యం చేసుకుంటున్నారని, కెనడా భూభాగంలో పనిచేస్తున్నారని ఆరోపించింది. కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ భారత్ ను రెచ్చగొట్టేలా మాట్లాడ్డమేకాక ఆంక్షల ప్రస్తావన కూడా తెచ్చారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News