Friday, November 15, 2024

ఇండియా నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్‌పై నిషేధాన్ని ఎత్తేసిన కెనడా

- Advertisement -
- Advertisement -

flights

టొరొంటో: భారత్ నుంచి నేరుగా విమానాలను కెనడా సోమవారం నుంచి అనుమతించనుంది. దాదాపు ఐదు నెలల తర్వాత విమానాల రాకపోకలపై నిషేధాన్ని ఎత్తేసింది. కెనడా తన ఈ నిర్ణయాన్ని ట్వీట్‌చేసింది. ‘సెప్టెంబర్ 27న 00.01 నుంచి మరిన్ని ప్రజారోగ్య చర్యలతో భారత్ నుంచి నేరుగా వచ్చే విమానాలను కెనడాలోకి అనుమతిస్తాం’ అని పేర్కొంది.
“ప్రయాణికులు ఢిల్లీ విమానాశ్రయంలోని జెనెస్ట్రింగ్స్ ల్యాబరేటరి ఆమోదించిన కోవిడ్-19 మాలిక్యులర్ పరీక్ష నెగటివ్ ప్రూఫ్‌ను విమానం బయలుదేరడానికి ముందు 18 గంటలలోకలిగి ఉండాలి” అని కూడా ఆ ట్వీట్‌లో పేర్కొంది. కెనడా, భారత్ నుంచి వచ్చే అన్ని విమానాలను ఏప్రిల్‌లో నిషేధించింది. కోవిడ్ రెండో వేవ్ సందర్భంగా ఈ నిషేధాన్ని ఎత్తేసింది. అయితే తర్వాత భారత నుంచి విమానాల రాకపోకలను నేరుగా తిరిగి పునరుద్ధరించే తేదీని అనేకసార్లు వాయిదావేస్తూ వచ్చింది. కెనడా తీసుకున్న ఈ తాజా నిర్ణయాన్ని కెనడాలో ఉన్న భారత హై కమిషనర్ అజయ్ బిసారియా స్వాగతించారు. ‘ఈ నిర్ణయం రెండు దేశాల మధ్య సాధారణ స్థితిని తీసుకురాగలదు’ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News