Sunday, December 22, 2024

కెనడాలో విదేశీ విద్యార్థుల సంఖ్యపై ఆంక్షలు?

- Advertisement -
- Advertisement -

అయితే అమెరికా…లేకపోతే కెనడా! విదేశాల్లో చదువుకోవాలనుకునే భారతీయ విద్యార్థుల ఆలోచన ఇలాగే ఉంటుంది. అమెరికా యూనివర్శిటీల్లో సీటు దొరక్కపోతే కెనడాకు వెళ్లి చదువుకుని, అక్కడే స్థిరపడాలని భావించే భారతీయ విద్యార్థులు చాలామందే ఉంటారు. కానీ తాజా పరిణామాల దృష్ట్యా విదేశీ విద్యార్థులపై కెనడా ప్రభుత్వం ఆంక్షలు విధించే అవకాశం కనిపిస్తోంది. దానివల్ల ఇదివరకటిలా కావాలనుకున్నప్పుడు భారతీయ విద్యార్థులకు వీసా దొరక్కపోవచ్చు.

కెనడా ఇమిగ్రేషన్ మంత్రి మార్క్ మిల్లర్ శనివారం చేసిన వ్యాఖ్యలనుబట్టి ఇకపై కెనడాలో చదువుకోవాలనుకునే విదేశీ విద్యార్థుల పరిమితిపై ఆంక్షలు విధించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. తమ దేశంలో నివసించే విదేశీ విద్యార్థుల సంఖ్యపై పరిమితి విధించే దిశగా ఆలోచన చేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చిస్తామనీ, ఎందుకంటే, విద్యార్థులను నియంత్రించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని ఆయన అన్నారు. కెనడాలోని కేంద్ర ప్రభుత్వం వలసదారులకు ఉదారంగా అనుమతులు ఇస్తుండటంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News