Wednesday, January 22, 2025

భారత్‌పై ఆంక్షలకు అవకాశం లేకపోలేదు: కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీ

- Advertisement -
- Advertisement -

భారత్, కెనడా మధ్య సంబంధాలు క్షీణిస్తుండగా, భారత్‌పై ఆంక్షలు విధించే అవకాశం లేకపోలేదని కెనడా విదేశాంగ శాఖ మంత్రి మెలానీ జోలీ సూచించారు. సిక్కు తీవ్రవాది నిజ్జర్ హత్య కేసు దర్యాప్తుతో భారత హైకమిషనర్‌ను ముడిపెడుతున్న ఒట్టావా ఆరోపణను భారత్ సోమవారం తోసిపుచ్చిన అనంతరం ఆరుగురు కెనడా దౌత్యాధికారులను బహిష్కరించడమే కాకుండా కెనడా నుంచి తమ హైకమిషనర్‌ను ఉపసంహరించిన విషయం విదితమే.

సోమవారం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మీడియా సమావేశంలో పాల్గొన్న జోలీ ఒక ప్రశ్నకు సమాధానం ఇస్తూ, భారత్‌పై మరిన్ని చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదని చెప్పారు. ‘ఈరోజు నిజంగా ముఖ్యమైన చర్య. మా వద్ద అందుబాటులో ఉన్నవి పరిశీలిస్తే, వియెన్నా కన్వెన్షన్ కింద ఒక దేశం తీసుకోగల అత్యున్నత, అత్యంత కఠిన చర్యల్లో దౌత్యాధికారుల బహిష్కరణ ఒకటి& ప్రతిదీ ఎదురుగానే ఉన్నది’ అని ఆమె చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News