Sunday, January 19, 2025

భారత్‌లో కెనడా ఇంటెలిజెన్స్ చీఫ్ అప్రకటిత పర్యటనలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఖలిస్థాన్ ఉగ్రవాది హర్‌దీప్‌సింగ్ నిజ్జార్ హత్యపై తమ దర్యాప్తులో వెలువడిన సమాచారాన్ని భారత్‌కు తెలియజేసేందుకు కెనడా ఇంటెలిజెన్స్ చీఫ్ డేవిడ్ విగ్నోల్ట్ భారత్‌లో ఫిబ్రవరి, మార్చిలో రెండుసార్లు పర్యటించారు. నిజ్జర్ హత్య వెనుక భారత్ ఏజెంట్ల హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో గత సెప్టెంబర్‌లో ఆరోపించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి కెనడా, భారత్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.

ఈ ఆరోపణలను భారత్ కొట్టి పారేసింది. ఈ నేపథ్యంలో విగ్నోల్డ్ సమాచారాన్ని పంచుకునేందుకు భారత్‌లో అప్రకటితంగా రెండుసార్లు పర్యటించారు. ఈ కేసులో అనుమానితులైన ముగ్గురు భారతీయులను అరెస్ట్ చేసే ముందు విగ్నోల్ట్ పర్యటన జరిగింది. వాస్తవాలు, జవాజుదారీతనానికి కెనడా ప్రాధాన్యం ఇస్తుందని, అందువల్ల రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ (ఆర్‌సిఎంపి) సాగిస్తున్న స్వతంత్ర దర్యాప్తుపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోమని కెనడా పేర్కొంటోంది. భారత్ కూడా విగ్నోల్డ్ పర్యటనలపై ఎలాంటి స్పందన చూపలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News