న్యూఢిల్లీ : భారత్ అంతర్గత వ్యవహారాల్లో కెనడా పదేపదే జోక్యం చేసుకుంటున్నందున ఢిల్లీ లోని ఆ దేశ దౌత్యవేత్తల సంఖ్యను తగ్గించాల్సి వచ్చిందని భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ ఆదివారం పేర్కొన్నారు. భారత్, కెనడా మధ్య సాగుతున్న దౌత్య వివాదం లోకి అమెరికా, బ్రిటన్ జోక్యం చేసుకోవడంపై ఆయన ఘాటుగా స్పందించారు. దౌత్యవేత్తల సంఖ్య విషయంలో దేశాలు సమానత్వ సూత్రాన్ని పాటించవచ్చని వియన్నా కన్వెన్షన్‌లో ప్రస్తావించిన నిబంధనలనై తాము అనుసరిస్తున్నామని స్పష్టం చేశారు. ఇతర దేశాల దౌత్యవేత్తలకు , ప్రజలకు భద్రత కల్పించాలనేది వియన్నా కన్వెన్షన్‌లోని కీలకమైన నిబంధన అని, దీని అమలులో కెనడా విఫలమైందని విమర్శించారు. భారత ప్రజలకు, దౌత్యవేత్తలకు కెనడాలో భద్రత లేకుండా పోయిందని పేర్కొన్నారు. భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు మెరుగైన తర్వాత వీసాల జారీని తిరిగి ప్రారంభిస్తామని వెల్లడించారు.
భారత్ అంతర్గత వ్యవహారాల్లో కెనడా జోక్యం : ఎస్. జైశంకర్ ఆందోళన
- Advertisement -
- Advertisement -
- Advertisement -