Monday, February 3, 2025

ట్రేడ్ వార్ షురూ

- Advertisement -
- Advertisement -

మెక్సికో,కెనడా, చైనాలపై అమెరికా భారీగా సుంకాలు
ఉత్తర్వులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకాలు
కెనడా, మెక్సికో దిగుమతులపై 25శాతం, చైనాపై
10శాతం టారిఫ్‌లు విధింపు వెంటనే అమెరికాపై
ప్రతీకారానికి దిగిన మూడు దేశాలు ట్రంప్ చర్యలతో
ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ద్రవ్యోల్బణం
పెరిగిపోతుంది అమెరికా చర్యలు మాకు ద్రోహమే:
కెనడా ప్రధాని ట్రూడో, మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా

వాషింగ్టన్ : అమెరికా ప్రెసిడెంట్ డోనాల్ ట్రంప్ మె క్సికో, కెనడా, చైనా దేశాల దిగుమతులపై భారీగా సుంకాలు వడ్డించారు. కెనడా, మెక్సికో దిగుమతుల పై 25శాతం, చైనాపై 10శాతం సుంకాలు విధిస్తూ శ నివారం ట్రంప్ ఈ మేరకు అడ్మినిస్ట్రేటివ్ ఆర్డర్ పై సంతకాలు చేశారు. కొత్త సుంకాలు మంగళవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ట్రంప్ ఉత్తర్వులు వె లువడిన వెంటనే అమెరికాపై ప్రతీకార చర్యలకు కెన డా, మెక్సికో, చైనా దేశాలు సిద్ధం అయ్యాయి. దీం తో ఆయా దేశాల మధ్య – ట్రేడ్ వార్ – మొదలైనట్లే… ట్రం ప్ చర్యలతో దీర్ఘకాలంగా అమెరికాతో సన్నిహిత సం బంధాలు కలిగిన దేశాలు ముఖ్యంగా కెనడా, మెక్సికో తమకు ద్రోహం జరిగినట్లు ఆవేదన చెందు తున్నా యి. అమెరికా ఫస్ట్ అన్న ట్రంప్ కల సాకారం కావాలంటే.. అమెరికన్ల రక్షణకు మూడు దేశాలపై భారీ సుంకాల విధింపు తప్పని సరి అని రిపబ్లికన్ పార్టీ అ ధినేత సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మెక్సికో, కెనడాల నుంచి అక్రమ

వలసలకు అడ్డుకట్ట వేసేందుకు, అక్రమ ఫెంటానిల్ తయారీ ,ఎగుమతిని అరికట్టడానికి ఈ చర్యలు తప్పవని హెచ్చరించారు. సుంకాల విధింపు ఇలా సాగితే, ద్రవ్యోల్బణం హెచ్చి, పరిస్థితి దిగజారుతుందని పలువురు అమెరికన్లు భయపడుతున్నారు. ఎన్నికల ముందు సరుకులు, గ్యాసోలిన్, ఆటోలు, ఇళ్లు ఇతర వస్తువుల ధరలు తగ్గించేందుకు కృషి చేస్తానని ట్రంప్ వాగ్దానం చేశారు. ట్రంప్ దుందుడుకు చర్యల వల్ల ప్రపంచ ఆర్థికవ్యవస్థ ప్రమాదంలో పడే అవకాశం ఉందని, రెండో సారి ప్రెసిడెంట్ పదవి చేపట్టిన రెండు వారాల్లోనే.. గందరగోళం సృష్టించాడని అంటున్నారు. చైనా నుంచి జరిగే అన్నిదిగుమతులపై పదిశాతం, మెక్సికో, కెనడా నుంచి దిగుమతులపై 25 శాతం సుంకాలు విధించడంతో పాటు ట్రంప్ ఆర్థిక ఎమర్జెన్సీ ఆదేశాలు విధించారు. కెనడా నుంచి లభించే ఎనర్జీ,చమురు, నేచురల్ గ్యాస్, ఎలక్ట్రిక్ సిటీ పై పదిశాతం పన్ను విధించారు. అమెరికా పై ఆయా దేశాలు ప్రతీకారంగా తామూ భారీగా సుంకాలు పెంచితే ట్రంప్ కూడా మరింత రెచ్చిపోయే అవకాశం ఉంది ఫలితంగా ఆర్థిక వ్యవస్థ మరింత చిక్కుల్లో పడుతుందని ఆవేదన చెందుతున్నారు.

ట్రంప్ ప్రకటనల పట్ల కెనడా ప్రధాని జుస్తిన్ ట్రూడో తీవ్రంగా స్పందించారు. అమెరికా కెనడా అత్యంత మిత్రదేశాలుగా ఉండేవి ట్రంప్ చర్యలు మా మధ్య అంతరాన్ని పెంచేదిగా ఉందని ఆయన విమర్శించారు. అమెరికా నుంచి ఆల్కాహాల్, పండ్లతో సహా అన్ని దిగుమతులపై తాము 25 శాతం సుంకం విధిస్తామని, అది 155 బిలియన్ అమెరికా డాలర్లకు సమానమని కెనడా ప్రధాని తెలిపారు. ట్రంప్ తన చర్యలతో తమకు ద్రోహం చేశారని కెనడా వాసులు ఆందోళన చెందుతున్నారని ట్రూడో తెలిపారు. ఆఫ్గనిస్తాన్ లో జరిగిన సైనిక చర్యలో తాము అమెరికాతో కలిసి పని చేశామని, కాలిఫోర్నియా లో అడవులు తగుల పడుతున్న సమయంలోనూ, కత్రినా హరికేన్ సమయంలోనూ తాము అమెరికాకు అండగా నిలిచామని ట్రూడో గుర్తు చేశారు. మెక్సికో ప్రెసిడెంట్ కూడా ప్రతీకార సుంకాలను విధిస్తూ ఆదేశాలు జారీ చేసారు.

చైనా కూడా అదే బాట పడుతోంది. మెక్సికన్ ప్రభుత్వానికి క్రిమినల్ సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న ట్రంప్ ఆరోపణలను మెక్సికన్ అధ్యక్షురాలు క్లాడియా షీన్‌బామ్ ఖండించారు. తమ భూభాగంలో జోక్యం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో వైట్ హౌస్ ఈ అరోపణలు చేస్తోందని ఆమె స్పష్టం చేసారు. మెక్సికో ప్రయోజనాల పరిరక్షణకు అమెరికాపై ప్రతీకార చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్రంప్ చర్యలతో ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుందని డెమక్రాట్లు హెచ్చరిస్తున్నారు. ట్రంప్ చర్యలవల్ల కిరాణా సరుకులు, టమోటా ధరల నుంచి కార్ల వరకూ అన్ని ధరలూ పెరుగుతాయని న్యూయార్క్‌కు చెందిన సెనేట్ డెమొక్రాటిక్ నాయకుడు చక్ షుమెర్ విమర్శించారు. ట్రంప్ సుంకాలు విధించడం ద్వారా, తన ఆర్థిక విధానాల విషయంలో చేసిన వాగ్దానాలను నెరవేసుకుంటున్నారు. కానీ, మిత్ర దేశాల నుంచి పెరిగే సుంకాల వల్ల వినియోగ వస్తువులు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News