- Advertisement -
కెనడా ప్రధాన మంత్రిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన మార్క్ కార్నీ మధ్యంతర ఎన్నికలకు పిలుపునిచ్చారు. పార్లమెంట్ లోని 333 స్థానాలకు ఏప్రిల్ 28న ఎన్నికలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఆ వెంటనే ఆదివారం 60 ఏళ్ల కార్నీ తోపాటు 45 ఏళ్ల ప్రతిపక్ష కన్సర్వేటివ్ నేత పియరీ పోలీవర్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ప్రచారం దాదాపు 37 రోజుల పాటు కొనసాగనుంది. జనవరిలో జస్టిన్ ట్రూడో ప్రధాని పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
- Advertisement -