Monday, January 20, 2025

ఖలిస్థాన్ వేర్పాటువాది నిజ్జర్ ను చంపిన ముగ్గురు భారతీయలు అరెస్టు!

- Advertisement -
- Advertisement -

ఒట్టావా: ఖలిస్థాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ ను చంపారన్న ఆరోపణపై కెనడా పోలీసులు ముగ్గురు భారతీయులను అరెస్టు చేశారు. నిజ్జర్ చంపివేత వెనుక భారతీయ ఏజెంట్ల ప్రమేయం ఉందని గత ఏడాది కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించాక, భారత, కెనడా సంబంధాలు బలహీన పడ్డాయన్న సంగతి ఇక్కడ గమనార్హం. ట్రూడో ఆరోపణలు నిరాధారం అంటూ భారత్ కొట్టి పారేసింది.

రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ (RCMP) అసిస్టెంట్ కమీషనర్ డేవిడ్ టెబౌల్ మాట్లాడుతూ సిక్కు కార్యకర్త నిజ్జర్ హత్య కేసులో ముగ్గురిని అరెస్టు చేసి అభియోగాలు మోపినట్లు తెలిపారు.  శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, హత్య కేసుతో పాటు, భారత ప్రభుత్వానికి ఉన్న సంబంధాలపై వేర్వేరు దర్యాప్తులు జరుగుతున్నాయని అన్నారని ‘టొరంటో స్టార్’ వార్తాపత్రిక నివేదించింది.

విలేఖరుల సమావేశంలో, ఇంటిగ్రేటెడ్ హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌కు నాయకత్వం వహిస్తున్న సూపరింటెండెంట్ మన్‌దీప్ మూకర్ మాట్లాడుతూ, నిజ్జర్ మరణంపై దర్యాప్తుకు ముందు నిందితులు “పోలీసులకు తెలియరు” అని అన్నారు.

మూకర్ అనుమానితులను కరణ్ బ్రార్, కరణ్‌ప్రీత్ సింగ్,కమల్‌ప్రీత్ సింగ్‌లుగా గుర్తించారు, వీరంతా 20 ఏళ్ల వయస్సులో ఉన్నారు, వీరిని శుక్రవారం ఎడ్మంటన్‌లో అరెస్టు చేశారన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News